చెల్లి పెళ్లి సరే.. నీదెప్పుడు? | actress nimrat kaur at her sisters wedding | Sakshi
Sakshi News home page

చెల్లి పెళ్లి సరే.. నీదెప్పుడు?

Published Sat, Feb 13 2016 6:11 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

చెల్లి పెళ్లి సరే.. నీదెప్పుడు? - Sakshi

చెల్లి పెళ్లి సరే.. నీదెప్పుడు?

క్యాడ్బరీస్ డెయిరీ మిల్క్ చాక్లెట్ యాడ్ లో భర్తపై మంచు ముద్దలు విసిరిన ముద్దుగుమ్మ గుర్తుందికదా! అదేనండి, ఆ మధ్య లంచ్ బాక్స్, ఇటీవల ఎయిర్ లిఫ్ట్ సినిమాలతో భారీగా అభిమానుల్ని, అంతకు మించి ప్రశంసల్ని అందుకుంది నటి నిమ్రత్ కౌర్. శుక్రవారం ఢిల్లీలో అంగరంగవైభవంగా తన చెల్లెలి పెళ్లి జరిపించి మరోసారి వార్తల్లోకెక్కారామె.

 

ఆర్మీలో పనిచేసిన నిమ్రత్ తండ్రి.. 2002లో కశ్మీర్ లో జరిగిన ఓ ఎన్ కౌంటర్ లో ప్రాణాలుకోల్పోయారు. అప్పటి నుంచి కుటుంబ భారాన్ని తన భుజస్కంధాలపైవేసుకున్న నిమ్రత్.. అన్నీతానై చెల్లెలి పెళ్లి జరిపించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అయితే వచ్చే నెలలో 34వ పడిలోకి అడుగుపెట్టనున్న నిమ్రత్ ను 'నీ పెళ్లెప్పుడు?' అని బంధువులు, మీడియా అడిగితే.. అందరు హీరోయిన్లలాగే 'దానికింకా టైముంది' అని బదులిచ్చింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement