‘లక్ష్మీ’ నచ్చేసిందట! | Akshay Kumar to remake telugu Lakshmi movie | Sakshi
Sakshi News home page

‘లక్ష్మీ’ నచ్చేసిందట!

Published Wed, Sep 10 2014 10:51 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

‘లక్ష్మీ’ నచ్చేసిందట! - Sakshi

‘లక్ష్మీ’ నచ్చేసిందట!

 ప్రస్తుతం బాలీవుడ్ హీరోల దృష్టి దక్షిణాది చిత్రాలపై ఉంది. ముఖ్యంగా తెలుగులో ఘనవిజయం సాధించిన రీమేక్స్‌లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు చిత్రాల రీమేక్స్‌లో నటించిన హీరోల్లో అక్షయ్‌కుమార్ ఒకరు. ‘విక్రమార్కుడు’ హిందీ రీమేక్ ‘రౌడీ రాథోడ్’లో నటించారాయన. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. దాంతో.. మళ్లీ టాలీవుడ్‌కి చెందిన సూపర్ హిట్ మూవీలో నటించాలనుకుంటున్నారట అక్షయ్. ఇటీవల ఆయన కొన్ని తెలుగు చిత్రాలు చూశారని సమాచారం. వాటిల్లో వెంకటేశ్ నటించిన ‘లక్ష్మీ’ ఉందట. ఆ చిత్రం అక్షయ్‌కి బాగా నచ్చేసిందని, హిందీలో రీమేక్ చేస్తే బాగుంటుందనుకున్నారని సమాచారం. అయితే, ఈ చిత్రం రీమేక్ హక్కుల గురించి తననెవరూ సంప్రదించ లేదని ‘లక్ష్మీ’ చిత్రనిర్మాత నల్లమలుపు బుజ్జి ‘సాక్షి’కి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement