
నేనెక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం..
ముంబై: భారతీయ సినిమా చరిత్రలో మర్చిపోలేని మేటి నటుడు, అందుకే ఇప్పటికీ బాలీవుడ్ మెగాస్టార్గా వెలుగొందుతున్నారు. దశాబ్దాల తరబడి సినీ అభిమానులను అలరిస్తూనే వున్నారు. ఆయనే అమితాబ్ బచ్చన్. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో వుండే ఈ బాలీవుడ్ సూపర్ స్టార్కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది.
తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అమితాబ్ మంగళవారం ఒక ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బోయ్ అండ్ స్కౌట్ డే సందర్భంగా దిగిన చిన్ననాటి ఫోటోను ఆయన ఒకదాన్ని షేర్ చేశారు. ఫోటో కింద ఉన్న పేర్లు చదవకుండానే నేను ఎక్కడ ఉన్నానో కనుక్కోండి అంటూ అభిమానులను కోరారు.