'కమల్ హాసన్ ను అరెస్ట్ చేయాలి' | Case filed on Bigg Boss Tamil | Sakshi
Sakshi News home page

'కమల్ హాసన్ ను అరెస్ట్ చేయాలి'

Published Wed, Jul 12 2017 4:49 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

'కమల్ హాసన్ ను అరెస్ట్ చేయాలి'

'కమల్ హాసన్ ను అరెస్ట్ చేయాలి'

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో బిగ్ బాస్ ఫీవర్ నడుస్తోంది. త్వరలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ హోస్ట్గా బిగ్ బాస్ షో ప్రారంభమవనుండగా.. ఇటీవల తమిళ బిగ్ బాస్ కమల్ హాసన్ హోస్ట్గా స్టార్ట్ అయ్యింది. అయితే తొలి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ షో ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కుంది. సౌత్ నేటివిటి పెద్దగా సూట్ అవ్వని ఈ షోపై ఓ స్వచ్ఛంద సంస్థ కేసు వేసింది.

హిందూ మక్కల్ కట్ఛి అనే తమిళ సంస్థ వెంటనే బిగ్ బాస్ షోనూ బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసింది. అంతేకాదు షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ తో పాటు పార్టిసిపెంట్స్ ఓవియా, నమితా, గంజా కరుప్పు తదితరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. షోలో పార్టిసిపెంట్స్ అభ్యంతరకర భాష వాడుతున్నారని.. అభ్యంతరకర దుస్తులు వేసుకుంటున్నారని.. ఇది తమిళ సాంప్రదాయానికి వ్యతికేకమని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement