తమిళసినిమా: సెంటిమెంట్స్ అనేవి అన్నిరంగాల్లోనూ ఉంటాయి. అవి సినిమారంగంలో ఇంకాస్త ఎక్కువ అని చెప్పకతప్పదు. నటి హన్సిక సెంటిమెంట్స్‌కు ప్రాధాన్యతనిస్తానంటోంది. ఈ బ్యూటీ 2003 లోనే బాల నటిగా హవా అన్న చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ తరువాత టాలీవుడ్‌లో కథానాయకిగా 2007లో విడుదలైన దేశముదురు చిత్రం ద్వారా పరిచయమైంది. ఇక కోలీవుడ్‌కు ధనుష్ సరసన మాప్పిళ్లై చిత్రం ద్వారా దిగుమతైంది. అలా తొలుత దక్షిణాదిలో టాలీవుడ్‌లో అడుగు పెట్టినా, కోలీవుడ్‌లోనే అధిక చిత్రాలు చేసింది. ఇక్కడ ఎంగేయుమ్ కాదల్, వేలాయుధం, ఒరుకల్ ఒరు కన్నాడి, సేట్టై, తీయా వేలై సేయనుమ్ కుమారు, సింగం 2, బిరియానీ, మాన్ కరాటే, అరణ్మణై, మిగామాన్, ఆంబళ, రోమియో జూలియట్, పులి, అరణ్యణై–2, పోకిరిరాజా, ఉయిరే ఉయిరే, బోగన్, గులేభాకావళి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.
హన్సిక సినీ వయసు 15 ఏళ్లు, అందులో కథానాయకిగా 11 ఏళ్లు. ఇప్పటికి 49 అన్ని భాషల్లో కలిపి 49 చిత్రాల్లో నటించింది. అందులో ఒక కన్నడ చిత్రం, ఒక మలయాళ చిత్రం మాత్రమే ఉన్నాయి. అలా అర్ధసెంచనీకి చేరువైన హన్సిక తాజాగా 50వ చిత్రానికి రెడీ అవుతోంది. విశేషం ఏమిటంటే బుధవారం ఈ బ్యూటీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన 50వ చిత్రాన్ని వెల్లడించనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ చిత్రం గురించి తన కోలీవుడ్ తొలి హీరో ధనుష్‌తో వెల్లడించనున్నట్లు హన్సిక మంగళవారం తన ట్విట్టర్‌లో పేర్కొంది. అయితే మాజీ ముఖ్యమంత్రి కరుణానిది మరణ సంఘటనతో ఆ ప్రకటన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు గురువారం ట్విట్టర్‌లో పేర్కొంది. అది ఏ భాషా చిత్రం అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment