బిగ్‌బాస్‌: అతనిలో నన్ను చూసుకుంటున్నాను! | I See Myself In Asim Riaz Says Prince Narula | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: అతనిలో నన్ను చూసుకుంటున్నాను!

Published Fri, Nov 29 2019 3:22 PM | Last Updated on Fri, Nov 29 2019 3:55 PM

I See Myself In Asim Riaz Says Prince Narula - Sakshi

సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ హిందీ షో సీజన్‌ 13లో.. ప్రస్తుతం ఉన్న కంటెస్టంట్‌లలో కశ్మీరీబాయ్‌ అసీమ్‌ రియాజ్‌ బాగా ఆడుతున్నాడని.. అతనిలో తనను తాను చూసుకుంటున్నానని బిగ్‌బాస్‌ సీజన్‌9 విజేత ప్రిన్స్‌ నారులా పేర్కొన్నారు. హౌజ్‌లో నిజాయితీగా గేమ్‌ ఆడుతూ అతను చూపే తెగువ, ధైర్యం తనకెంతో నచ్చాయని.. అందుకే అతనికి సపోర్ట్‌ చేస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. అంతేకాక అతనికి గట్స్‌ ఉన్నాయంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. వీడియోలో ప్రిన్స్‌ భార్య యువికా చౌదరీ కూడా అసిమ్‌కు సపోర్టు చేస్తూ కనిపించారు. అసిమ్‌ సినీ నేపథ్యం నుంచి ఏమాత్రం రాకపోయినా.. హౌజ్‌లో సెలిబ్రిటీల మధ్య తన మార్క్‌ను చూపిస్తున్నాడని ప్రిన్స్‌ అభిప్రాయపడ్డాడు.

ఇక అసిమ్‌ కేవలం ఫ్యాన్స్‌ మద్దతు మాత్రమే కాక సల్మాన్‌ ఖాన్‌, గౌహర్‌ ఖాన్‌, గౌతమ్‌ గులాటి, సంభావన సేఠ్‌తో పాటు పలు ప్రముఖ సెలిబ్రిటీల మద్దతును ఇప్పటికే ముఠా గట్టుకున్నాడు. ఇక బిగ్‌బాస్‌ సీజన్‌ 13 ఏమాత్రం బాగోలేదు.. బోరింగ్‌గా ఉందంటూ అభిప్రాయపడిన ప్రేక్షకులకు ఆ తర్వాత హౌజ్‌లో కాసింత వినోదం కనిపించింది. ప్రస్తుతం మాత్రం హౌజ్‌లో అరుపులు, కేకలు వినిసిస్తున్నాయి. గడిచిన రెండు వారాల్లో హౌజ్‌లో పరిస్థితులు అనూహ్యంగా మారాయి. ప్రేక్షకులకు ఒక పట్టాన ఏమి అర్థం కావడం లేదు. హౌజ్‌లో బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా ఉండేవారు బద్ధ శత్రువులుగా మారితే.. ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే వారు స్నేహితులుగా మారిపోయారు. హౌజ్‌లో ఇక రొమాన్స్‌ గురించి చెప్పనక్కర్లేదు. సిద్ధార్థ్‌శుక్లా- రష్మీదేశాయ్‌ హౌజ్‌లో ప్రేమయాణం మొదలెట్టిన తర్వాత విశాల్‌ ఆదిత్యసింగ్‌- మహీర శర్మ, ఆ తర్వాత అసిమ్‌ రియాజ్‌- హిమాన్షీ ఖురానా జంట కట్టారు. ఇక అసిమ్‌ తన ఫీలింగ్స్‌ గురించి ఎన్నిసార్లు వ్యక్తపరచినప్పటికినీ హిమాన్షీ మాత్రం మిన్నకుండి పోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement