మీరాజాస్మిన్‌ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్.. | Meera Jasmine Selfie Viral In Social Media | Sakshi
Sakshi News home page

రీఎంట్రీకి మీరాజాస్మిన్‌ రెడీ!

May 1 2019 9:01 AM | Updated on May 1 2019 9:01 AM

Meera Jasmine Selfie Viral In Social Media - Sakshi

ఆమెను చూసిన వారు ఆశ్చర్యపోయారు. అంతగా లావైపోయింది.

సినిమా: మలయాళ నటి మీరాజాస్మిన్‌ గుర్తుందా? ఒక్క మలయాళం ఏమిటి, తమిళం, తెలుగు అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నాయకిగా నటించేసింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో రన్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే పేరు తెచ్చుకుంది. నటిగా మంచి ఫేమ్‌లో ఉండగానే ఒక ప్రముఖ మలయాళ దర్శకుడుతో ప్రేమలో పడి ఆ తరువాత వివాదాల్లో చిక్కుకున్న మీరాజాస్మిన్‌ 2014లో అనిల్‌జాన్‌ టైటిస్‌ అనే ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. భర్తతో కలిసి దుబాయ్‌లో సెటిల్‌ అయిన ఈ అమ్మడు గత ఏడాది ఒక నగల దుకాణం ప్రారంభోత్సవానికి చెన్నైకి వచ్చింది.

అప్పుడు ఆమెను చూసిన వారు ఆశ్చర్యపోయారు. అంతగా లావైపోయింది. ఇక మీరాను సినిమాల్లో చూడలేం అని ఆమె ఫొటో చూసిన అభిమానులకు తాజాగా మరో షాక్‌. ఇటీవల మలమాళ దర్శకుడు అరుణ్‌ గోపీ దుబాయ్‌కు వెళ్లారు. అక్కడ నటి మీరాజాస్మిన్‌ను కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అందులో మీరాజాస్మిన్‌ నమ్మశక్యం కానంతగా సన్నబడింది. కాగా ఈ అమ్మడు తాజాగా నటిగా రీఎంట్రీకి సిద్ధం అవుతోందని, అందుకే చాలా స్లిమ్‌గా తయారైందని సినీ వర్గాల టాక్‌. అదేవిధంగా ఆమె ఆభిమానులు మీరాజాస్మిన్‌కు వెల్‌కమ్‌ చెబుతూ ట్విట్టర్‌లో ట్వీట్‌లు చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా లేక అక్కగా, వదినగా నటిస్తుందా అన్నది వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement