ఏఆర్ రెహ్మాన్ కుమారుడు పాడిన పాట ఇదే.. | Nagarjuna releases A R Ameen debut song in Twitter | Sakshi
Sakshi News home page

ఏఆర్ రెహ్మాన్ కుమారుడు పాడిన పాట ఇదే..

Published Mon, Feb 15 2016 7:23 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

ఏఆర్ రెహ్మాన్ కుమారుడు పాడిన పాట ఇదే.. - Sakshi

ఏఆర్ రెహ్మాన్ కుమారుడు పాడిన పాట ఇదే..

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ కుమారుడు అమీన్ తెలుగు సినిమా కోసం పాట పాడాడన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్న 'నిర్మలా కాన్వెంట్' సినిమా కోసం అమీన్ తన స్వరాన్నందించాడు. నిమ్మగడ్డ ప్రసాద్తో పాటు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున సోమవారం సాయంత్రం అమీన్ పాడిన పాటను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు.

ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. రోషన్‌ సాలూరి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. జై చిరంజీవ, దూకుడు తదితర చిత్రాల్లో బాలనటిగా చేసిన శ్రేయాశర్మ ఈ సినిమాలో కథానాయిక. నాగార్జున కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement