వెండితెర పైకి రాజశేఖర్ కూతురు
ఇన్నాళ్లూ సినిమా హీరోల కొడుకులు మాత్రమే వెండితెర మీదకు వస్తుండేవారు. ఇప్పుడు సీజన్ మారింది. శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి, కమల్ కూతురు శ్రుతి హాసన్ లాంటి వాళ్లు బాగా క్లిక్ కావడంతో ఇప్పుడు మరో హీరో రాజశేఖర్ కూడా తన కూతురు శివానిని హీరోయిన్గా తీసుకొస్తున్నారు. 'వందకి వంద' అనే సినిమాలో ఆమె హీరోయిన్గా చేయబోతోంది. తన కూతురికి ఇంతకంటే మంచి మొదటిసినిమా ఏమీ ఇవ్వలేనని రాజశేఖర్ అంటున్నారు.
శివానికి లాంచ్ చేసేందుకు మంచి ప్రాజెక్టు కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నామని, ఇన్నాళ్లకు మంచి ప్రాజెక్టు వచ్చిందని జీవిత, రాజశేఖర్ అన్నారు. 'వందకి వంద' సినిమాలో ఆమెది చాలా ముఖ్యమైన పాత్ర అని, తన 'గడ్డం గ్యాంగ్' సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని రాజశేఖర్ అన్నారు. ఈ సినిమాలో ఆయన కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.