అలాంటి చోట.. ఆయన షర్ట్‌ లేకుండా ఉన్నారు : ఉపాసన | Ram Charan Work Outs At Vinaya Vidheya Rama Shooting Spot | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 6 2019 4:36 PM | Last Updated on Sun, Jan 6 2019 5:15 PM

Ram Charan Work Outs At Vinaya Vidheya Rama Shooting Spot - Sakshi

మిష్టర్‌ సీ.. షర్ట్‌ లేకుండా లొకేషన్‌లో వర్కౌట్లు చేసేస్తున్నాడట. ఇంతకీ మిష్టర్‌ సీ అంటే తెలుసుగా.. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌. ఆయన సతీమణి ఉపాసన.. చెర్రీని ముద్దుగా మిష్టర్‌ సీ అంటుంటారు. వినయ విధేయ రామ సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో చెర్రీ వర్కౌట్లు చేస్తున్న వీడియోను ఉపాసన సోషల్‌ మీడియాలో  పోస్ట్‌ చేశారు. 

ఇప్పటికే ట్రైలర్‌లో చూపిన భారీ యాక్షన్‌ సీన్స్‌ మెగా ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తున్నాయి. షూటింగ్‌లో యాక్షన్‌ సీన్స్‌ను తెరకెక్కించే ముందు కసరత్తులు చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘గడ్డకట్టేలా చలి ఉంది అయినా అతను షర్ట్‌ లేకుండా ఉన్నారు. మిష్టర్‌ సీ నిజమైన హీరో. ఫైట్‌ మాస్టర్‌ కణల్‌ కన్నన్‌ ఇస్తున్న కంపెనీకి ధన్యవాదాలు. మీ ఫైట్స్‌ సూపర్‌గా ఉంటాయి’ అంటూ ట్వీట్‌ చేశారు. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement