వీవీఆర్‌: చెర్రీ డైట్‌ ఎంటో తెలుసా..? | Ram Charan Diet For Vinaya Vidheya Rama | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 3 2019 10:15 AM | Last Updated on Thu, Jan 3 2019 10:28 AM

Ram Charan Diet For Vinaya Vidheya Rama - Sakshi

బోయపాటి సినిమాలో హీరోలను ఎలివేట్‌ చేసే విధానమే కొత్తగా ఉంటుంది. అప్పటివరకు ఉన్నఅల్లు అర్జున్‌ బాడీ లాంగ్వేజ్‌ను ‘సరైనోడు’ సినిమాతో పూర్తిగా మార్చేశాడు. ఇక మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ను ‘వినయ విధేయ రామ’లో తెరపై చూపించిన విధానానికి ఫ్యాన్స్‌ ఖుషీ అయిపోతున్నారు. ముఖ్యంగా ట్రైలర్‌లోని యాక్షన్‌ సీన్స్‌లో చెర్రీ బాడీని ఎలివేట్‌ చేస్తూ తీసిన షాట్స్‌ను పీక్స్‌లో తెరకెక్కించాడు. 

అయితే ఈ సినిమాలో చెర్రీ బాడీని షేప్‌ చేయడానికి చాలానే కష్టపడ్డాడు. దీనికోసం ప్రత్యేకమైన డైట్‌ను కూడా ఉపయోగించి.. జిమ్‌లో తెగ వర్కౌట్లు చేసేశాడు. రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన.. డైట్‌ తాలుకా సంగతులను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఉదయం 8 గంటలకు బాదం పాలు, ఓట్స్‌, ఎగ్స్‌ను.. 11:30 గంటలకు ఒక పెద్ద కప్పు వెజిటబుల్‌ సూప్‌ను, 1:30 గంటలకు 200గ్రాముల చికెన్‌, 3/4 కప్పు బ్రౌన్‌ రైస్‌, సగం కప్పు గ్రీన్‌ వెజిటబుల్‌ కర్రీ, సాయంత్రం 4 గంటలకు 250 గ్రాముల గ్రిల్లిడ్‌ ఫిష్‌, 200 గ్రాముల స్వీట్‌ పొటాటో, సగం కప్పు గ్రీన్‌ వెజిటబుల్స్.. ఆరు గంటలకు పెద్ద కప్పు మిక్స్‌డ్‌గ్రీన్‌ సలాడ్‌, 1/4 అవకాడో, ఒక బౌల్‌ నిండా గింజలు, మళ్లీ ఆరు నుంచి రాత్రి 8 గంటల వరకు ఏమైనా ఆకలి వేస్తే.. గింజలను, పచ్చి కూరగాయలను స్నాక్స్‌గా తీసుకుంటాడు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కనీసం నీళ్లు కూడా తీసుకోడంటూ.. చెర్రీ డైట్‌ రహస్యాన్ని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement