భర్త అంటే ఎంత ప్రేమో..! | Upasana Cooking Fish In VVR Shooting Spot For Ram Charan | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 4 2019 10:27 AM | Last Updated on Fri, Jan 4 2019 10:56 AM

Upasana Cooking Fish In VVR Shooting Spot For Ram Charan - Sakshi

టాలీవుడ్‌ సెలబ్రెటీ కపుల్స్‌లో రామ్‌ చరణ్‌-ఉపాసనలది ప్రత్యేకం. తన భర్తకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులకు చేరవేస్తూ.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ఉపాసన. డైట్‌ విషయంలో, న్యూట్రిషన్‌ ఫుడ్‌పై తనకు ఉన్న అవగాహన గురించి సోషల్‌ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారికి తెలుస్తుంది. అసలే తన భర్త డైటింగ్‌లో ఉన్నాడు.. టైమ్‌కు సరైన డిష్‌ ఉండాలి..అని ఆలోచించి.. ఉపాసన చేసిన వంటకం వైరల్‌ అవుతోంది.

‘వీవీఆర్‌’ షూటింగ్‌లో రామ్‌ చరణ్‌ బిజీగా ఉండగా.. ఆయన అసిస్టెంట్‌ పక్కనే ఉన్న సరస్సుల్లోంచి చేపను పట్టుకొచ్చారు. అయితే ఈ డిష్‌ను ఉపాసన కారం, ఉప్పు లేకుండా ఆలీవ్‌ ఆయిల్‌, నిమ్మకాయను వాడి వండారు. స్వీట్ పొటాటో లేకపోయేసరికి మాములు పొటాటోను ఉడకబెట్టి ఇచ్చారు. శ్రీవారి డైట్‌ విషయంలో ఉపాసన చూపించే శ్రద్ధ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం యాక్షన్‌ సన్నివేశాలను షూట్‌ చేస్తోన్న చిత్రయూనిట్‌.. ఈ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement