ఎన్టీఆర్‌ ఫస్ట్‌ లుక్‌పై వర్మ కామెంట్‌ | Ram Gopal Varma Comment On NTR Aravindha Sametha First Look | Sakshi
Sakshi News home page

Published Sun, May 20 2018 9:14 AM | Last Updated on Sun, May 20 2018 10:53 AM

Ram Gopal Varma Comment On NTR Aravindha Sametha First Look - Sakshi

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మొదటిసారిగా వస్తున్న ఈ కాంబినేషన్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే తివిక్రమ్‌ గత సినిమా అజ్ఞాతవాసి నిరాశపరచడంతో తివిక్రమ్‌పై ఎన్టీఆర్‌ అభిమానులకు అనుమానాలు కలిగాయి. 

అయితే ఎన్టీఆర్‌ పుట్టినరోజు కానుకగా రిలీజ్‌ చేసిన సినిమా టైటిల్‌, ఎన్టీఆర్‌ ఫస్ట్‌ లుక్‌తో ఆ అనుమానాలన్నింటిని పటాపంచలు చేసేసింది చిత్రయూనిట్‌. సిక్స్‌ ప్యాక్‌తో ఎన్టీఆర్‌, కత్తి పట్టుకుని ఉన్న ఈ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగాయి. అరవింద సమేత టైటిల్‌ కాగా, వీర రాఘవ అనేది ఉపశీర్షిక. టైటిల్ కూడా విభిన్నంగా ఉందంటూ సోషల్‌మీడియా పాజిటివ్‌ కామెంట్స్‌ వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఫస్ట్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

అయితే ఎన్టీఆర్‌ ఫస్ట్‌ లుక్‌పై వివాదాల వర్మ తనదైన శైలీలో కామెంట్‌ చేశారు. ‘ వావ్‌... తారక్‌ సెక్సీలుక్‌లో ఎన్నడూ లేనంత సెక్సీగా ఉన్నారు. ఎన్టీఆర్‌ సెక్సీ కంటే ఎక్కువ సెక్సీగా ఉన్నారు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. తమన్‌ సంగీతాన్ని అందించగా , హారిక అండ్‌​ హాసిని క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement