వాళ్ల పెళ్లి తరువాతే.. నా పెళ్లి : రానా | Rana to get married after prabhas, nithin | Sakshi
Sakshi News home page

వాళ్ల పెళ్లి తరువాతే.. నా పెళ్లి : రానా

Published Thu, Jul 20 2017 3:17 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

వాళ్ల పెళ్లి తరువాతే.. నా పెళ్లి : రానా - Sakshi

వాళ్ల పెళ్లి తరువాతే.. నా పెళ్లి : రానా

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో రానా ఒకడు. ఇప్పటికే ముప్పై ఏళ్లు దాటి మూడేళ్లు గడుస్తున్నా ఈ టాల్ బాయ్ ఇంత వరకు పెళ్లి ఊసే ఎత్తటం లేదు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న రానా, తన పెళ్లిపై ఆసక్తికర కామెంట్ చేశాడు.

'ప్రభాస్, నితిన్ లు నాకంటే పెద్దవాళ్లు. ముందు వాళ్ల పెళ్లి కానివ్వండి తరువాతే నేను పెళ్లి చేసుకుంటా.. ప్రస్తుతం నా వయసు కేవలం 33 మాత్రమే..  అయిన నా పెళ్లి గురించి మా ఇంట్లో వాళ్లే తొందర పెట్టడం లేదు కదా' అన్నాడు. ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడన్న ప్రచారం గట్టిగానే జరుగుతుంది. ఇక నితిన్ రానా కన్నా కేవలం ఏడాది పెద్ద. అతను కూడా లై రిలీజ్ తరువాత పెళ్లి ఆలోచన చేస్తాడన్న ప్రచారం జరుగుతోంది. మరి అప్పుడైన రానా మనసు పెళ్లిమీదకు మల్లుతుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement