సమ్మరంతా సమంత | Samantha movies release on summer | Sakshi
Sakshi News home page

సమ్మరంతా సమంత

Published Wed, Mar 20 2019 12:21 AM | Last Updated on Wed, Mar 20 2019 5:07 AM

Samantha movies release on summer - Sakshi

గత ఏడాది తెలుగు, తమిళ భాషల్లో కలిపి 5 సినిమాల్లో కనిపించారు సమంత. అందులో మూడు చిత్రాలు (రంగస్థలం, మహానటి, అభిమన్యుడు) బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగించాలని ఫిక్స్‌ అయినట్టున్నారు. ఈ సమ్మర్‌లో మూడుసార్లు థియేటర్స్‌లో కనిపించనున్నారు సమంత. ఇందులో ఓ తమిళ సినిమా, రెండు తెలుగు సినిమాలున్నాయి. మార్చి 29న సమంత, విజయ్‌ సేతుపతి, రమ్యకృష్ణ, ఫాహద్‌ ఫాజిల్‌ నటించిన మల్టీస్టారర్‌ తమిళ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’ రిలీజ్‌ కానుంది.

తమిళంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాతి వారంలో ఏప్రిల్‌ 5న ‘మజిలీ’ రిలీజ్‌ అవుతుంది. వివాహం తర్వాత భర్త నాగచైతన్యతో కలసి సమంత తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న చిత్రమిది. ఈ రెండూ కాకుండా సమంత లీడ్‌ రోల్‌లో నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఓ బేబి’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఇది సమ్మర్‌లోనే రాబోతుందని చిత్రబృందం ప్రకటించింది. వీటికితోడు ‘96’ తెలుగు రీమేక్‌ షూటింగ్‌ని కూడా ఏప్రిల్‌లో స్టార్ట్‌ చేయనున్నారు. సో.. ఈ ఏడాది సమ్మరంతా సమంతే సమంత అన్నమాట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement