
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నేడు పుట్టినరోజు వేడుకల్లో బిజీగా ఉన్నాడు. తన అభిమానులు మాత్రం తదుపరి చిత్రానికి సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ వస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే డియర్ కామ్రేడ్ జూలై 26న వస్తున్నట్లు ప్రకటించిన చిత్రబృందం మరో అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంది.
ఈ చిత్రం నుంచి రెండో పాటను ఆదివారం మే 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మొదటి పాట సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దక్షిణాది అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తోంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ నిర్మిస్తోంది.
This Sunday.
— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2019
The 12th of May.
You will experience what I call "The Song of the Year"#DearComrade pic.twitter.com/zZg2QTBTSu
Comments
Please login to add a commentAdd a comment