రయీస్ వివాదం: షారుక్ ఖాన్‌పై కేసు | shah rukh khan booked for damaging railway property during raees promotion | Sakshi
Sakshi News home page

రయీస్ వివాదం: షారుక్ ఖాన్‌పై కేసు

Published Wed, Feb 15 2017 8:59 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

రయీస్ వివాదం: షారుక్ ఖాన్‌పై కేసు

రయీస్ వివాదం: షారుక్ ఖాన్‌పై కేసు

రైల్వే ఆస్తులపై దాడిచేసి, వాటిని ధ్వంసం చేసినందుకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌పై రైల్వే పోలీసులు కేసు పెట్టారు. రాజస్థాన్‌లోని కోటా రైల్వేస్టేషన్ వద్ద తన సినిమా ప్రమోషన్ కోసం ఆయన వచ్చినప్పుడు ఈ పనిచేశాడని, ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు. కోటా రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం మీద ఉన్న ఓ వర్తకుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన రైల్వేకోర్టు షారుక్‌పై కేసు పెట్టాలని సూచించడంతో జీఆర్పీ సిబ్బంది కేసు నమోదుచేశారు. షారుక్ ఖాన్ జనవరి 23వ తేదీన కోటా రైల్వేస్టేషన్‌కు వచ్చారని, అక్కడ ఆయన అభిమానులు విపరీతంగా రావడంతో స్టేషన్ మొత్తం ధ్వంసమైందని విక్రమ్ సింగ్ అనే వ్యాపారి ఆరోపించారు. 
 
ఆరోజు ఆగస్ట్ క్రాంతి రాజ్‌ధాని ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ గేటు వద్ద నిలబడిన షారుక్.. ప్రజల్లోకి ఏదో విసిరాడని, దాంతో దాన్ని పట్టుకోడానికి అందరూ ఒక్కసారిగా అటువైపు వెళ్లడంతో తన ట్రాలీ తిరగబడిపోయి అందులో ఉన్న ఆహార పదార్థాలన్నీ ధ్వంసమయ్యాయని, తనకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయని విక్రమ్ సింగ్ తెలిపారు. అతడి ఫిర్యాదు మేరకు షారుక్ ఖాన్‌పై ఐపీసీ సెక్షన్లు 427, 120 (బి), 147, 149, 160ల కింద కేసులు పెట్టారు. దాంతోపాటు రైల్వే చట్టంలోని 145, 146, 3 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement