అచ్చం అలాగే కాపీ కొట్టిన తమన్నా | Tamanna copied just like that | Sakshi
Sakshi News home page

అచ్చం అలాగే కాపీ కొట్టిన తమన్నా

Published Wed, May 21 2014 10:27 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

అచ్చం అలాగే కాపీ కొట్టిన తమన్నా

అచ్చం అలాగే కాపీ కొట్టిన తమన్నా

తమన్నా ఎంత గొప్ప అందగత్తో, అంత మంచి నటి. ఎలాంటి సన్నివేశాన్నయినా సునాయాసంగా చేసేస్తుందని దర్శక, నిర్మాతలు అంటుంటారు. అలాంటి తమన్నా ఇటీవల ఒక సన్నివేశం విషయంలో చాలా ఇబ్బందిపడిపోయారు. హిందీ చిత్రం ‘హమ్ షకల్స్’ సినిమాకు సంబంధించిన సీన్ అది. ఇందులో తమన్నా వీజేగా నటిస్తున్నారు. వీజే అంటే వీడియో జాకీ. ఎదురుగా వందల మంది ఉన్నా తడబడకుండా హుషారుగా మాట్లాడాలి. ఇలాంటి ఓ సన్నివేశాన్నే తమన్నాపై చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఈ సన్నివేశంలో పాల్గొనడానికి తమన్నా చక్కగా మస్తాబై, లొకేషన్‌లోకి అడుగుపెట్టారు. చుట్టూ బోల్డంత మంది.

వాళ్లందరినీ ఉద్దేశించి మైక్ తీసుకుని తమన్నా చమత్కా రాలు విసురుతూ మాట్లాడాలన్నమాట. అంతమంది మధ్యలో నటించడం తమన్నాకు కొత్త కాదు. కానీ, వీజేగా చేయడం కొత్త. మైక్‌ను స్టయిల్‌గా పట్టుకుని, గుక్క తిప్పుకోకుండా మాట్లాడటానికి ఆమె ఇబ్బందిపడిందట. దాంతో చిత్రదర్శకుడు సాజిద్‌ఖాన్ స్వయంగా అభినయించి చూపించారట. పూర్వాశ్రమంలో సాజిద్ ఓ టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ అనుభవంతో వీజేగా ఎలా చేయాలో ఆయన తమన్నాకి చూపించారు. సాజిద్ ఎలా అయితే చేశారో అచ్చంగా అలానే చేసిందట తమన్నా. ‘నన్ను తమన్నా యథాత థంగా కాపీ కొట్టేసింది’ అని సాజిద్ సరదాగా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement