
వరలక్ష్మీ శరత్ కుమార్
కథానాయికలు కేవలం గ్లామర్‌కి మాత్రమే అంటే అస్సలు ఒప్పుకోరు వరలక్ష్మీ శరత్ కుమార్. ఎప్పటికప్పుడు చాలెంజింగ్ రోల్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారామె. ఇందులో భాగంగా ఇటీవల అంధురాలిగా నటించడానికి కూడా ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘రాజపార్వై’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్రబృందం. 1981లో వచ్చిన కమల్ హాసన్ సినిమా టైటిల్ ఇది కావడం విశేషం. ‘రాజపార్వై’ సినిమా ‘అమావాస్య చంద్రుడు’ టైటిల్‌తో తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
అంటే వరలక్ష్మీ అమావాస్య చందమామగా కనిపించబోతోందా?. చూపు లేని అమ్మాయిగా కనిపించడానికి వరలక్ష్మీ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. అంధురాలిగా నటించడం ఓ సవాల్ అంటే.. ఈ చిత్రంలో ఫైట్స్ కూడా చేస్తారు వరలక్ష్మీ. అందుకోసం కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారట. పాత్ర పట్ల తనకున్న డెడికేషన్ అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం తమిళ హీరోయిన్స్‌లో ఫుల్ బిజీ యాక్టర్ కూడా వరలక్ష్మీనే. సుమారు 4–5 సినిమాలతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment