![200మందిని బుక్ చేశారు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51455098251_625x300.jpg.webp?itok=qHswLTxS)
200మందిని బుక్ చేశారు
ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్లో ఓ ఎనిమిదేళ్ల బాలుడి మృతికి సంబంధించి పోలీసులు 200మందిని బుక్ చేశారు. వారందరిపై కేసులు నమోదు చేసి మరో కీలక నిందితులకోసం గాలింపులు చేపడుతున్నారు. వారి గురించి ఆచూకీ తెలిపిన వారికి మంచి రివార్డు కూడా ఉంటుందని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో సమాజ్ వాది పార్టీ కార్యక్రమానికి సంబంధించి వేడుకలు నిర్వహించే గ్రామంలో ఓ పెద్ద గుంపు గాల్లోకి కాల్పులు జరిపింది.
ఈ కాల్పులకు ఓ ఎనిమిదేళ్ల బాలుడు బలయ్యాడు. దీంతో ఆ ప్రాంతంలో భారీ ఎత్తున ఆందోళన చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన వ్యక్తులు పారిపోయారు. ఘటనా స్థలిలోని వీడియో ఫుటేజిని సొంతం చేసుకున్న పోలీసులు దాని ఆధారంగా 200 మందిని బుక్ చేయడంతోపాటు మరో కీలక నిందితులను గుర్తించి వారికోసం గాలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 200మంది గుర్తు తెలియని వ్యక్తులపై సెక్షన్ 147(హింసకు దిగడం), 148 (హత్యకు వాడే ఆయుధాలను ఉపయోగించడం), 149, 143(చట్ట విరుద్ధంగా గుమి గూడటం), 188 నిబంధనలు ఉల్లంఘించడం వంటి పలు సెక్షన్లు పెట్టారు. కాగా, బాలుడి కుటుంబానికి రూ.5లక్షల సాయం ప్రకటించిన అఖిలేశ్ యాదవ్.. నేరస్తులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.