2014 కమల నామ సంవత్సరం: మోడీ
భాగ్ పట్: 2014 సంవత్సరం కమల, మోడీ నామ సంవత్సరం అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పట్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకుల నుంచి స్వేచ్చ కోసం స్వరాజ్ ఉద్యమం చేశారు. ప్రస్తుతం మంచి పాలన (సురాజ్) కోసం ప్రజలు పోరాటం చేస్తున్నారు అని అన్నారు.
దేశానికి వెన్నుముక లాంటి రైతులను, జవాన్లను పట్టించుకోవడం లేదని మోడీ ఆరోపించారు. ప్రస్తుతం దేశానికి రక్షణ లేకుండా పోయిందని ఆయన అన్నారు. రైతు పక్షపాత ప్రభుత్వమని కాంగ్రెస్ చెప్పుకొవడంపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.