మధ్యాహ్న భోజనానికి ఆధార్ తప్పనిసరి
న్యూఢిల్లీ: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి, లబ్ధిదారులైన విద్యార్థులకు ఆధార్ కార్డును తప్పనిసరిచేస్తూ మానవ వనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యకు చెందిన సబ్సిడీ పథకాలను కేంద్రం ఆధార్‌తో అనుసంధానిస్తుండటంతో పథకంలో పారదర్శకత పెంచేందుకే ఈ చర్య చేపట్టారు.
మానవ వనరుల శాఖ అధీనంలో పనిచేసే ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ(డీఎస్‌ఈఎల్) ఆధార్‌లేని వారికి కార్డు పొందేందుకు జూన్ 30 వరకు గడువిచ్చింది. విద్యార్థులంతా తమ ఆధా ర్ వివరాలను సమర్పించాలని కోరుతూ పాఠశాలలకు నోటిఫికేషన్ పిస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పథకంలో పనిచేస్తున్న వంటవాళ్లు, సహాయకులను కూడా లబ్ధిదారులుగానే పరిగణిస్తామని కాబట్టి వారికీ ఆధార్ ఉండాలని ఆయన వెల్లడించారు.