
అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమైన చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీ భవన్‌కు వచ్చిన కేజ్రీవాల్, చంద్రబాబుతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు దిశగా చంద్రబాబు ఆయనతో చర్చించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని చంద్రబాబు ప్రతిపాదించినట్టు సమాచారం. ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇప్పటికే కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కూటమిపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు, కేజ్రీవాల్‌తో ఏకాంత చర్చలు జరిపారు.
స్పందించని కేజ్రీవాల్
చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడాలని కేజ్రీవాల్‌ను టీడీపీ నేతలు కోరారు. కానీ ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. అయితే కేజ్రీవాల్ తమకే మద్దుతు ఇచ్చారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీడియాతో చెప్పారు. ప్రాంతీయ పార్టీల కూటమిలో చక్రం తిప్పాలని చంద్రబాబు భావిస్తున్నారంటూ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment