న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే సన్నిహితులుగా ముద్ర పడిన ఆప్ కార్యకర్తలు షాజియా ఇల్మి, కిరణ్ బేడీలు బీజేపీలో చేరడం దారుణమని ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతకర్త యోగేందర్ యాదవ్ ఆరోపించారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ' కేంద్రంలోని అధికార బీజేపీకి అర్థబలం, మీడియాబలం, కార్పొరేట్ బలం పుష్కలంగా ఉన్నాయన్నారు. బీజేపీ మోసపూరిత పార్టీ అని ఆయన విమర్శించారు.
మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీకి అన్ని రకాల బలాలు ఉన్నాయని.. అయిన ఆమె 'మోసం' పార్టీ వైపు వెళ్లారని అన్నారు. ఢిల్లీ ఓటర్లు చాలా చైతన్యవంతులని యోగేంద్ర యాదవ్ గుర్తు చేశారు. బీజేపీ ఆడుతున్న నాటకాలను వారు ఎండగడతారు.ఆయన తెలిపారు. ఈ నెల 10న న్యూఢిల్లీలో జరిగిన మోదీ ర్యాలీ ఫ్లాప్ అయిందని... ఆ ర్యాలీకి కేవలం 25 వేల మంది ప్రజలే పాల్గొన్నారని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో ఏ విధంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారో ప్రధాని మోదీకే తెలియాలని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా యోగేంద్ర యాదవ్ తెలిపారు.