పనాజి: ఫిబ్రవరి 4న జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా వచ్చాయి. రికార్డు స్థాయిలో ఓటింగ్ లో పాల్గొన్న ప్రజలు.. అటు బీజేపీకి గానీ, ఇటు కాంగ్రెస్ కు గానీ స్పష్టమైన మెజార్టీ సీట్లు అందించలేదు. ఇటీవల జరిగిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో బీజేపీ అధికారం చేపడుతుందని, బీజేపీ అతిపెద్దపార్టీగా అవతరించినా మేజిక్ ఫిగర్ ను అందుకోవడం కష్టమని కొన్ని సర్వేలు తెలిపాయి.ఏ పార్టీకి మెజార్టీ రాకున్నా కాంగ్రెస్ 17 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది.
గోవాలోని మొత్తం 40 స్థానాలకు గాను 17 స్థానాల్లో కాంగ్రెస్, 13 స్థానాల్లో బీజేపీ, మహారాష్ట్రవాది గోమంతక్ 3 స్థానాలు, గోవా ఫార్వర్డ్ పార్టీ 3 స్థానాల్లో, ఎన్సీపీ 1, స్వతంత్రులు 3 స్థానాల్లో గెలుపొందారు. ముఖ్యంగా బీజేపీ నేత, గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ సోప్టే చేతిలో ఓటమిపాలయ్యారు. సీఎం సహా ఆరుగురు రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఓటమి పాలయ్యారు. గోవా ఫార్వర్డ్ పార్టీ, ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ ముమ్మర యత్నాలు చేస్తోంది.
- మాండ్రెం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఓటమిపాలయ్యారు.
- మపుసా నియోజకవర్గంలో గోవా డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్థి ఫ్రాన్సిస్ డిసౌజా విజయం సాధించారు.
- మయెం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ప్రవిణ్ జంతీ విజయం సాధించారు.
- దబోలిం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హెలియోడొరొ గొడిన్హో విజయం సాధించారు.
- పోరియం నియోజకవర్గంలో ప్రతిపక్షనాయకుడు, కాంగ్రెస్ మాజీ సీఎం ప్రతాప్ సింగ్ రాణె విజయం సాధించారు.
- కలంగుటే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మైఖెల్ విన్సెంట్ లోబో విజయం సాధించారు.
- బెనాలిమ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చర్చిల్ అలిమావో గెలుపొందారు.
- బిచోలిమ్ నియోజకవర్గం నుంచి రాజేష్ పత్నేకర్ భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందారు.
- అల్డోనా నుంచి గ్లెన్ సౌజా టిక్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు.
- బెనాలిమ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చర్చిల్ అలిమావో గెలుపొందారు.
- నేవేం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి విల్‌ఫ్రెడ్ డిసా గెలుపొందారు.
- క్యూపెం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రకాంత్ కాలేకర్ విజయం సాధించారు.
- సంక్వెలిమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి డా.ప్రమోద్ పాండురంగ్ సావంత్ గెలుపొందారు.
- సన్వొర్డెమ్ నియోజకవర్గం నుంచి మహారాష్ట్రవాడీ గోమంతక్ పార్టీ అభ్యర్థి దీపక్ ప్రభు పౌస్కర్ విజయం సాధించారు.
- సియోలిమ్ నియోజకవర్గం నుంచి గోవా ఫార్వాడ్ పార్టీ అభ్యర్థి వినోద దాతరామ పాలింకర్ గెలుపొందారు.
- సిరోడా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుభాష్ అంకుశ్ శిరోద్కర్ గెలుపొందారు.
- సెయింట్ ఆండ్రే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫ్రాన్సిస్కో సిల్వెరా విజయం సాధించారు.
- టాలీగావ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెన్నీఫర్ మొన్‌సెర్రట్ గెలుపొందారు.