
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములు (ఫైల్‌ఫోటో)
సాక్షి, బెంగళూర్ : పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములు మద్దతు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతుగా ఆగస్ట్ 2న కొన్ని సంస్థలు ఇచ్చిన బంద్ పిలుపును ఆయన సమర్ధించారు. ఉత్తర కర్ణాటకకు జరుగుతున్న అన్యాయంపై తాము మౌనంగా ఉండలేమని, ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని తదుపరి ఏం చేయాలో కార్యాచరణ రూపొందిస్తున్నామని శ్రీరాములు పేర్కొన్నారు.
ప్రత్యేక తెలంగాణ తరహాలో ఉత్తర కర్ణాటక ఉద్యమం ఊపందుకుంటుందన్నారు. సంకీర్ణ సర్కార్ ఉత్తర కర్ణాటకను నిర్లక్ష్యం చేస్తోందని, ముఖ్యమంత్రి కుమారస్వామి పక్షపాత రాజకీయాలను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కుమారస్వామి కేవలం రెండు జిల్లాలకే సీఎంగా ప్రవరిస్తున్నారని, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాన్ని ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
తమ ప్రాంత ప్రయోజనాలను సీఎం విస్మరిస్తున్నారని ఉత్తర కర్ణాటకకు చెందిన పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment