separate state
-
‘మేం గెలిస్తే ప్రత్యేక రాష్ట్రం’
లక్నో: తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా మార్చేందుకు తమ పార్టీ గట్టి చర్యలు తీసుకుంటుందని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ముజఫర్‌నగర్ లోక్‌సభ స్థానం బీఎస్పీ అభ్యర్థి దారా సింగ్ ప్రజాపతికి మద్దతుగా మాయావతి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాయావతి మాట్లాడుతూ బీజేపీకి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. "పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కావాలని మీరు కోరుకుంటున్నారు. ఇందుకోసం కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం" అని మాయావతి చెప్పారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఓటింగ్ యంత్రాలను తారుమారు చేయకుంటే ఈసారి బీజేపీ అధికారంలోకి రాదని బీఎస్పీ చీఫ్ అన్నారు. ముజఫర్‌నగర్‌లో బీజేపీ నుంచి సంజీవ్ కుమార్ బల్యాన్, సమాజ్ వాదీ పార్టీ నుంచి హరేంద్ర సింగ్ మాలిక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ తన ర్యాలీకి ముందు, మాయావతి సహరాన్పూర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్‌లలో మొత్తం ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
Tripura Assembly Elections 2023: మోత మోగేనా?
2018 అసెంబ్లీ ఎన్నికలు. లెఫ్ట్ కూటమి పాతికేళ్ల పాలనతో విసిగిపోయిన త్రిపుర ప్రజలను బీజేపీ అభివృద్ధి మంత్రం ఆకట్టుకుంది. దాని భాగస్వామ్య పార్టీ ఐపీఎఫ్‌టీకి గిరిజనుల్లో ఉన్న ఆదరణ తోడైంది. దాంతో 60 సీట్లకు గాను కాషాయ పార్టీ ఏకంగా 36 స్థానాల్లో నెగ్గింది. ముఖ్యంగా 20 ఎస్టీ స్థానాల్లో ఏకంగా 17 సీట్లను కొల్లగొట్టింది! ఐదేళ్ల తర్వాత పరిస్థితులు తారుమారవుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర నినాదంతో రాజకీయ పార్టీ అవతారమెత్తిన ఉద్యమ సంస్థ టిప్రా మోతా ఈసారి అధికార పార్టీ పుట్టి ముంచేలా కన్పిస్తోంది... ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుతోంది. పోలింగ్ (ఫిబ్రవరి 16) తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీలన్నీ అమ్ములపొదుల్లోంచి అన్ని అస్త్రాలూ బయటికి తీస్తున్నాయి. రాష్ట్రంలో పాతికేళ్ల లెఫ్ట్ పాలనకు 2018 ఎన్నికల్లో బీజేపీ తెర దించింది. గిరిజనుల్లో బాగా పట్టున్న ఐపీఎఫ్టీ పార్టీతో జట్టు కట్టి ఘనవిజయం సాధించింది. సీపీఎం 16 సీట్లకు పరిమితం కాగా కాంగ్రెస్ సోదిలోకూడా లేకుండా పోయింది. ఈసారి మాత్రం టిప్రా మోతా రూపంలో కొత్త పార్టీ తెరపైకి రావడంతో సమీకరణాలన్నీ మారిపోయాయి. పరిస్థితి తారుమారు... త్రిపుర మాజీ రాజ కుటుంబానికి చెందిన ప్రద్యోత్ బిక్రం మాణిక్యదేబ్ బర్మన్ సారథ్యంలో కొంతకాలంగా ప్రత్యేక గిరిజన రాష్ట్రం కోసం పోరాడుతున్న తిప్రా (త్రిపుర ఇండిజినస్ ప్రోగ్రెసివ్ రీజనల్ అలయన్స్) మోతా ఈసారి పార్టీగా రూపాంతరం చెందింది. బీజేపీతో పొత్తు ప్రయత్నాలు విఫలం కావడంతో ఒంటరిగానే రంగంలోకి దిగి పోటీని ముక్కోణంగా మార్చేసింది. అధికార బీజేపీ కూటమికి గట్టి సవాలు విసురుతోంది. మూలవాసులైన గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రంగా గ్రేటర్ తిప్రాలాండ్‌ను సాధిస్తామన్న మోతా హామీ ఎస్టీలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఐపీఎఫ్టీతో పొత్తు ద్వారా బీజేపీ కొల్లగొట్టిన గిరిజన ఓట్లు ఈసారి చాలావరకు మోతావైపు మళ్లే సూచనలు కన్పిస్తున్నాయి. గిరిజనుల్లోని లెఫ్ట్ ఓటు బ్యాంకుకూ మోతా గండి కొట్టేలా ఉంది. త్రిపురలో గిరిజన ప్రాబల్యం ఎక్కువ. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో 20 వారికి రిజర్వయ్యాయి. అంతేగాక మరో 23 గిరిజనేత స్థానాల్లోనూ 10 శాతానికి పైగా ఉన్న ఎస్టీలు అక్కడా నిర్ణయాత్మకంగానే ఉన్నారు. 2018లో బీజేపీ కూటమి 20 ఎస్టీ సీట్లలో ఏకంగా 17 స్థానాలను దక్కించుకుంది! అలా బీజేపీ కూటమికి అధికారంలోకి రావడంలో కీలకంగా మారిన గిరిజన ఓట్లరు ఈసారి టిప్రా మోతాకే ఓటేస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ సీట్లలో ముఖ్యంగా గిరిజనులు 60 శాతానికి పైగా ఉన్న 12 చోట్ల మోతాకు విజయావకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి. 50–60 శాతం మధ్య ఉన్న 5 స్థానాల్లో మోతా గట్టి పోటీ ఇవ్వనుండగా 50 శాతాం కంటే తక్కువగా ఉన్న మిగతా మూడు చోట్ల ముక్కోణ పోరు జరిగేలా కన్పిస్తోంది. ఎలా చూసినా బీజేపీ కూటమికి ఈ 20 సీట్లలో ఈసారి రెండు మూడు సీట్లకు మించి దక్కకపోవచ్చని అంచనా. దీనికి తోడు గిరిజన ప్రాబల్యమున్న 23 గిరిజనేతర అసెంబ్లీ స్థానాల్లో కూడా మోతా ఏకంగా 22 చోట్ల పోటీకి దిగడం బీజేపీకి నిద్ర లేకుండా చేస్తోంది. బీజేపీ కూటమి 12 నుంచి 15 సీట్లు కోల్పోయి హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని అంచనా. 10 నుంచి 15 సీట్లు గెలిచేలా కన్పిస్తున్న మోతా కింగ్‌మేకర్ అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు. ఓట్ల చీలికపైనే లెఫ్ట్ ఆశలు గత ఎన్నికలఓల 42 శాతానికి పైగా ఓట్లు సాధించినా సీట్ల లెక్కలో వెనకబడ్డ సీపీఎం, ఈసారి ఓట్ల చీలికపై బాగా ఆశలు పెట్టుకుంది. బీజేపీ–ఐపీఎఫ్టీ కూటమిని ఓడించేందుకు శత్రుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. 20 గిరిజన సీట్లతో పాటు 22 గిరిజనేతర స్థానాల్లో బీజేపీ ఓటు బ్యాంకుకు మోతా గండికొట్టనుండటం సీపీఎం–కాంగ్రెస్ కూటమికి కలిసొచ్చేలా కన్పిస్తోంది. దీనికి తోడు 2.5 లక్షల ఉద్యోగాలు తదితర హామీలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాకపోతే కాంగ్రెస్ ఓటర్లలో చాలామంది పొత్తును గౌరవించి సీపీఎం అభ్యర్థులకు ఓటేసేందుకు సిద్ధంగా లేరు. ఏడు దశాబ్దాల వైరాన్ని, అధికారంలో ఉండగా తమపట్ల సీపీఎం అనుసరించిన అణచివేత ధోరణిని మర్చిపోలేమని స్పష్టంగా చెబుతున్నారు. అయితే ముస్లింల్లో అత్యధికులు లెఫ్ట్ వైపే మొగ్గుతున్నారు. బీజేపీ.. అభివృద్ధి మంత్రం 2018లో బీజేపీ అభివృద్ధి నినాదాన్ని జనం నమ్మడంతో ఆ పార్టీ ఏకంగా 43 శాతం ఓట్లు సాధించింది! ఆశించిన అభివృద్ధి కనిపించలేదన్న అసంతృప్తి జనాల్లో ఉంది. శాంతిభద్రతలు క్షీణించాయన్నది మరో పెద్ద ఆరోపణ.అయితే మరోసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూస్తామంటున్న వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. పీఎం ఆవాస్ యోజన మొదలుకుని కిసాన్ సమ్మాన్ నిధి దాకా పలు కేంద్ర పథకాల లబ్ధిదారులు ఎక్కువగానే ఉన్నారు. వీరిలోనూ మహిళల సంఖ్య ఎక్కువ. వారు మళ్లీ బీజేపీకే ఓటేస్తామంటున్నారు. పైగా సీఎం మాణిక్ సాహాకు ప్రజల్లో మంచి పేరుంది. కానీ 9 నెలల క్రితం దాకా సీఎంగా ఉన్న బిప్లబ్ దేబ్ పట్ల జనంలో ఉన్న వ్యతిరేకత బీజేపీకి నష్టం చేసేలా కన్పిస్తోంది. పైగా 2018లో గిరిజనుల్లో మంచి ఆదరణతో 8 సీట్లు సాధించిన భాగస్వామ్య పార్టీ ఐపీఎఫ్టీ ఆ తర్వాత అధ్యక్షుడు ఎన్.సి.దేబ్బర్మ మృతితో బాగా బలహీనపడింది. దాంతో బీజేపీ ఈసారి ప్రభుత్వ పథకాలనే నమ్ముకుని వాటిపై భారీ ప్రచారంతో హోరెత్తిస్తోంది. రాష్ట్రమంతటా కాషాయ జెండాలే ఎగురుతున్నాయి! ఎక్కడికక్కడ పోలింగ్ బూత్ కార్యాలయాలు తెరిచి తమ నేతలు, కార్యకర్తలను ఓటర్లతో నిత్యం టచ్‌తో ఉంచుతూ అధికార పార్టీ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు పోతోంది. హిందువుల్లో అత్యధికులైన బెంగాలీలు, ఎస్టీల్లో ఎగువ కులాల వారు బీజేపీ వైపే మొగ్గుతున్నారు. ఇక గిరిజన స్థానాల్లోని బెంగాలీలు బీజేపీకి, ముస్లింలు సీపీఎంకు జై కొడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రత్యేక తెలంగాణ తరహాలో..
సాక్షి, బెంగళూర్ : పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములు మద్దతు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతుగా ఆగస్ట్ 2న కొన్ని సంస్థలు ఇచ్చిన బంద్ పిలుపును ఆయన సమర్ధించారు. ఉత్తర కర్ణాటకకు జరుగుతున్న అన్యాయంపై తాము మౌనంగా ఉండలేమని, ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని తదుపరి ఏం చేయాలో కార్యాచరణ రూపొందిస్తున్నామని శ్రీరాములు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ తరహాలో ఉత్తర కర్ణాటక ఉద్యమం ఊపందుకుంటుందన్నారు. సంకీర్ణ సర్కార్ ఉత్తర కర్ణాటకను నిర్లక్ష్యం చేస్తోందని, ముఖ్యమంత్రి కుమారస్వామి పక్షపాత రాజకీయాలను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కుమారస్వామి కేవలం రెండు జిల్లాలకే సీఎంగా ప్రవరిస్తున్నారని, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాన్ని ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రాంత ప్రయోజనాలను సీఎం విస్మరిస్తున్నారని ఉత్తర కర్ణాటకకు చెందిన పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప తోసిపుచ్చారు. -
కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాలేదు
చెరుకు సుధాకర్ హైదరాబాద్: నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు పిడికిలి బిగించబట్టే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, కేవలం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాలేదని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. 2009 డిసెంబర్ 9న ప్రకటన రాకుంటే 10న తన దీక్షను భగ్నం చేసి ఉండేవారన్నారు. ‘యూ టర్న్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దాక’ అంశంపై శుక్రవారం ఇక్కడ జరిగిన ‘పునశ్ఛరణ’ సభలో సుధాకర్ మాట్లాడారు. వేలాది మంది విద్యార్థులతో జేఏసీని ఏర్పా టు చేసి, ఉద్యమం చేసి సాధించిన రాష్ట్రంలో వారికి హక్కులు లేవని, అట్టడుగు వర్గాలకు గౌరవం లేదని, ఉద్యమకారులకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం వచ్చాక మొదటగా ఉద్యమకారులే నష్టపోయారని అన్నారు.ఇప్పుడు విద్యార్థులు నాయకత్వాన్ని తట్టి లేపాలని పిలుపు నిచ్చారు.అరుణోదయ విమలక్క మాట్లాడు తూ ఉద్యమ సమయం లో ఆత్మహత్యలను కూడా కొంతమంది నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో ఓ అబద్థాల పుస్తకమన్నారు. రాష్ట్రంలో మీటింగ్ లు పెట్టుకునేందుకు హాల్ పర్మిషన్లు కూడా ఇవ్వడంలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానాలను నేటికీ అమలు చేయలే దన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని చూస్తే త్యాగా లు ఒకరివి, భోగాలు మరొకరివన్న చందం గా ఉందన్నారు. వేదిక ఉపాధ్యక్షులు రియా జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, గాయకు డు ఏపూరి సోమన్న, అరుణోదయ ప్రధాన కార్యదర్శి బి.మోహన్, టీపీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ పాల్గన్నారు. -
అమరుల కుటుంబాలను ఆదుకుంటాం
సాక్షి, ఖమ్మం: ‘1969 నుంచి ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు ఎందరో వీరుల త్యాగఫలం తెలంగాణ.. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అసువులుబాశారు. వారి కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రతి అమరుడి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. అమరవీరులకుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం.. వ్యవసాయాధారిత కుటుంబాలకు వ్యవసాయ భూమి, అమర వీరుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తాం.’ అని ఎక్త్సెజ్ శాఖ మంత్రి టి.పద్మారావు ప్రకటించారు. నవ తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం తొలి స్వాతంత్య్ర వేడుకలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ నినాదాలు, గీతాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్యాలు, ప్రదర్శనలతో గ్రౌండ్ మార్మోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి టి.పద్మారావుగౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కరీంనగర్‌కు చెందిన పోలీస్ కిష్టయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతోనే అమర వీరులకు కుటుంబాలను ఆదుకునే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా పోరాడిన ఉద్యమకారులపై సీమాంధ్ర సర్కారు అనేక అక్రమ కేసులు బనాయించిందని, వీటన్నింటినీ ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పంట చేతికి రాక, సాగుకు చేసిన అప్పులు తీర్చలేక..కుటుంబం గడవక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి రుణ భారాన్ని పంచుకోవడాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.లక్ష వరకు రుణ మాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని గిరిజన సోదరులు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించి వారికి విద్య, ఉద్యోగావకాశాలను మెరుగు పరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, సకలజనుల సమ్మె చేసిన ఉద్యోగుల సంక్షేమం తమ బాధ్యత అని, అందుకే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రకటించామని చెప్పారు. అద్భుత పథకంకళ్యాణలక్ష్మి .. పేద దళిత, గిరిజన ఆడపిల్లల వివాహానికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టిన పథకమే కల్యాణ లక్ష్మి అని మంత్రి పద్మారావు అన్నారు. దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం లేదన్నారు. పేద విద్యార్థులు వృత్తి, ఉన్నత విద్యలనభ్యసించేందుకు వీలుగా ప్రభుత్వం ఫాస్ట్ పథకం ప్రవేశపెట్టిందన్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇచ్చి వారికి గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు. దళిత బిడ్డలు పూర్ణ, ఆనంద్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ రాష్ట్ర కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటారని ప్రశంసించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించే ఉద్దేశంతోనే సమగ్ర సర్వే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. సర్వే రోజున ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించారని, ఆ రోజు అందరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తాం.. వచ్చే ఏడాది జూలైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో రూ.18.26 కోట్లతో 255 పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలోని ఆరు పురపాలక సంఘాల్లో రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేయనుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వరుసగా జరిగిన సార్వత్రిక, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగిలే జిల్లా అధికారులు, పోలీసులు కృషి చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, ఎస్పీ ఏవీ.రంగనాథ్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, బాణోతు మదన్‌లాల్, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జాయిల్ కలెక్టర్ సురేంద్రమోహన్, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. -
పునర్వ్యస్థీకరణపై కొత్త ప్రభుత్వం ఆలోచన
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం కొత్త జిల్లాల ఏర్పాటుకు నాంది పలకనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న డిమాండ్లకు పరిష్కారం దొరకనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం... రంగారెడ్డి జిల్లాను ఐదు జిల్లాల పరిధిలోకి తేవాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రాథమిక కసరత్తును కూడా పూర్తి చేసిన ఆ పార్టీ అధినాయకత్వం 2016 నాటికి వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీంతో వికారాబాద్‌ను ప్రత్యేక జిల్లా చేయాలనే డిమాండ్ కార్యరూపం దాల్చనుంది. పాలనా సౌలభ్యం కోసం.. మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి పేరిట 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పట్లో కేవలం 11.09 లక్షల జనాభా ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది 52.76 లక్షలకు చేరింది. నగరీకరణ నేపథ్యంలో వలసల తాకిడి పెరగడంతో జిల్లా జన విస్పోటాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఆరు అసెంబ్లీ స్థానాల స్థానే 14 శాసనసభ సెగ్మెంట్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పరిపాలనా సౌలభ్యం పేర జిల్లాను విభజించాలనే చ ర్చ తెరమీదకు వచ్చింది. ముఖ్యంగా జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో... వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేయాలనే అంశంపై చర్చోపచర్చలు సాగాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈ డిమాండ్ మరింత ఊపందుకుంది. దీన్ని ఎన్నికల హామీగా మార్చుకున్న పార్టీలు అధికారంలోకి వస్తే వికారాబాద్ పరిసరాలను కలుపుతూ ప్రత్యేక జిల్లాగా మలుస్తామని హామీ ఇచ్చాయి. శాస్త్రీయత పాటించకుండానే.. తెలంగాణ వ్యాప్తంగా 24 జిల్లాలను ఏర్పాటు చేయాలనే టీఆర్ఎస్ పెద్దల ఆలోచన బాగా నే ఉన్నా.. అనుసరించిన విధానం మాత్రం హేతుబద్ధంగా లేదు. ప్రస్తుతం ఉన్న రంగారెడ్డి జిల్లాను ఐదు కొత్త జిల్లాల పరిధిలో కలపాలని ప్రణాళిక తయారు చేశారు. అయితే, భౌగోళికంగా, రవాణాపరంగా అ నువుగా ప్రాంతాలను జిల్లా కేంద్ర ంగా ప్రతి పాదించారు. తద్వారా పాలనా సౌలభ్యం దే వుడెరుగు ప్రజలకు కొత్త ఇబ్బందులు తప్పేలా లేవు. సగటున 15 లక్షల జనాభా, ఐదు నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లా పునర్విభజనకు టీఆర్ఎస్ ప్రతిపాదనలు రూపొందించింది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని మలక్‌పేట, దాని సమీపంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలను నల్గొండ జిల్లా భువనగిరి కేంద్రంగా ఏర్పడే రంగారెడ్డి తూర్పు జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. దీనివల్ల ప్రస్తుతం కూతవేటు దూరంలో ఉన్న జిల్లా కేంద్రం కాస్తా... సుదూరం కానుంది. ఇలాగే పలు నియోజకవర్గాలను కొత్త జిల్లాలో కలిపే అంశంపై శాస్త్రీయత పాటించనట్లు కనిపిస్తోంది. కాగా, పశ్చిమ రంగారెడ్డి ప్రాంతంలోని నాలుగు నియోజక వర్గాలతో వికారాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. తాండూరు, చేవెళ్ల, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల వాసులు ఈ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పకపోయినా, రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు మాత్రం వికారాబాద్‌లో తమ ప్రాంతాన్ని విలీనం చేసే అంశంపై వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశంలేకపోలేదు. ఇదిలావుండగా, టీఆర్ఎస్ పెద్దలు రూపొందించిన జిల్లాల పునర్వ్యస్థీకరణ బ్లూప్రింట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాను అడ్డగోలుగా విభజించాలని చూస్తే సహించేది లేదని, ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని భువనగిరి కేంద్రంగా ఏర్పడే జిల్లాలో కలపాలనుకోవడం అర్థరహితమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సహేతుక కారణాలు చూపకుండా.. నిపుణులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏకపక్షంగా చేపడితే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. -
అదనంగా 2గంటలు పనిచేస్తాం
మీట్ ది మీడియా కార్యక్రమంలో టీఎన్జీవోస్ అధ్యక్షుడు దేవీప్రసాద్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైతే అదృంగా రెండు గంటలు పనిచేస్తామని టీఎన్జీవోస్ అధ్యక్షుడు దేవీప్రసాద్ తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడి పించేందుకు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, వచ్చే ఐదేళ్లు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో టీఎన్జీవో వాచ్‌డాగ్‌లా పనిచేస్తుందన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయం, అందుకు పూనుకున్న పాలకులే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తూ, ఆత్మగౌరవపోరాటం చేశామని, ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్ స్టేట్ సర్కారీ ములాజిం యూనియన్ (ప్రస్తుత టీఎన్జీవోస్) తెలంగాణకు చెందిన అన్ని రంగాల ఉద్యోగులను కలుపుకొని పోరాటం చేసిందని, 1952లోనే మొదటిసారి ఫజల్అలీ కమిషన్ ముందు తమ వ్యతిరేకతను వ్యక్తం చేసిందన్నారు. రాజకీయ పార్టీలు కలసి రాకపోయినా, ఉద్యోగులతోపాటు అప్పటి నుంచే విద్యార్థులు కలసి వచ్చారని, 1969 ఉద్యమం విద్యార్థుల పాత్ర మరువలేదన్నారు. 369 మంది విద్యార్థుల బలిదానాలు చేశారని, తెలంగాణ రాష్ట్రంలో వారి కుటుంబాలకు స్వాతంత్య్ర సమరయోధుల కు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తాము ఒకరోజు వేతనం ఇస్తామని, కోదండరాం నేతృత్వంలో ట్రస్టు ఏర్పాటు చేసి, ఆ కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సిన వివి ధ అంశాలు, విధానాలపై 21 అంశాలతో నివేదిక రూపొం దించామని, దాని అమలుకు కృషి చేస్తామని సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి తెలిపారు. విలేకరులు అడిగిన వివిధ ప్రశ్నలకు దేవీప్రసాద్ ఇచ్చిన సమాధానాలు పునర్నిర్మాణమంటే.. తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడమే. ఆత్మగౌరవంతో బతికేలా చేయడమే. మొత్తం మంజూరైన పోస్టులను తీసుకొని 58 శాతం పోస్టులను సీమాంధ్రకు కేటాయించాలి. వాటిల్లోకి ప్రస్తుతం ఉన్న సీమాంధ్రులను పంపించాలి. ఆ తరువాతే తెలంగాణకు ఉద్యోగులకు కేటాయించాలి. అప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. 60వేల వరకు ఖాళీలు వస్తాయి. వాటిల్లో తిష్టవేసిన వారిని ఆంధ్రాకు పంపించాలి. తెలంగాణ ప్రభుత్వం జిల్లాల్లో డీఎస్సీల ద్వారా భర్తీ చేస్తుంది. తద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయి. విభజనలో గిర్గ్లానీ కమిటీ సిఫారసులను అమలు చేయాలి. మేం రాజకీయాల్లోకి ఇప్పుడే రాము. మా ముందున్న లక్ష్యం రాష్ట్ర పునర్నిర్మాణమే. -
తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదే
జహీరాబాద్, న్యూస్‌లైన్: జహీరాబాద్, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకే దక్కుతుదని మాజీ మంత్రి జె.గీతారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాత్రి షెట్కార్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే విషయంలో సోనియా గాంధీ ఏ మాత్రం వెనుకకు తగ్గలేదన్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్ధతు తెలిపే విషయంలో బీజేపీ రాజకీయంగా ఎత్తుగడలు వేసినా అవి పారలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందున ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి అధికారం అప్పగించేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ సంబరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ప్రచారం చేసుకోలేక పోతోందన్నారు. ఇతర పార్టీల నేతలు మాత్రం ఏమి చేయకున్నా అంతా తామే చేశామన్న విధంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలను ఒక్క కాంగ్రెస్ పార్టీయే అందించగలుగుతుందన్నారు. యువత సైతం రాహూల్‌గాంధీ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరిగి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తేవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, గీతారెడ్డి భర్త రాంచంద్రారెడ్డి, కుమార్తె మేఘనారెడ్డి, అల్లుడు సుధీర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ కిషన్‌రావు పవార్, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మంకాల్ సుభాష్, హన్మంత్‌రావు పాటిల్, ఆర్.అరవింద్‌రెడ్డి, కె.నర్సింహులు, ఎండీ ఖాజా, చంద్రశేఖర్, ముబీన్ తదితరులు పాల్గొన్నారు. విజయోత్సవ ర్యాలీకి వర్షం అడ్డంకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయంత్రం జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ ర్యాలీకి వర్షం అడ్డు పడింది. ర్యాలీ మధ్యలో ఉండగా భారీ వర్షం కురిసింది. దీంతో నాయకులు, కార్యకర్తలు చెల్లా చెదురయ్యారు. గంటపాటు వర్షం కురియడంతో ర్యాలీని అర్థంతరంగా నిలిపి వేశారు. వర్షం తగ్గిన అనంతరం సభను షెట్కార్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేశారు. దత్తగిరి కాలనీ నుంచి ప్రారంభమైన ర్యాలీ బ్లాక్‌రోడ్డు వరకు చేరుకోగానే వర్షం మొదలైంది. వర్షం ఎంతకూ తగ్గక పోవడంతో అర్థంతరంగా రద్దు చేసి సభ నిర్వహించారు. ఆడి పాడిన గీతారెడ్డి విజయోత్సవ ర్యాలీలో మాజీ మంత్రి గీతారెడ్డి ఆడి పాడారు. ర్యాలీలో మహిళలు బతుకమ్మను బోనాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ పాట పాడుతూ ఆడారు. తలపై బోనం ఎత్తుకుని సంతోషాన్ని పంచుకున్నారు. ర్యాలీలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. గీతారెడ్డి అల్లుడు సుధీర్‌రెడ్డిని పార్టీ కార్యకర్తలు గుర్రంపై కూర్చోబెట్టి ఊరేగించారు. . సోమవారం రాత్రి షెట్కార్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే విషయంలో సోనియా గాంధీ ఏ మాత్రం వెనుకకు తగ్గలేదన్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్ధతు తెలిపే విషయంలో బీజేపీ రాజకీయంగా ఎత్తుగడలు వేసినా అవి పారలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందున ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి అధికారం అప్పగించేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ సంబరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ప్రచారం చేసుకోలేక పోతోందన్నారు. ఇతర పార్టీల నేతలు మాత్రం ఏమి చేయకున్నా అంతా తామే చేశామన్న విధంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలను ఒక్క కాంగ్రెస్ పార్టీయే అందించగలుగుతుందన్నారు. యువత సైతం రాహూల్‌గాంధీ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరిగి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తేవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, గీతారెడ్డి భర్త రాంచంద్రారెడ్డి, కుమార్తె మేఘనారెడ్డి, అల్లుడు సుధీర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ కిషన్‌రావు పవార్, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మంకాల్ సుభాష్, హన్మంత్‌రావు పాటిల్, ఆర్.అరవింద్‌రెడ్డి, కె.నర్సింహులు, ఎండీ ఖాజా, చంద్రశేఖర్, ముబీన్ తదితరులు పాల్గొన్నారు. విజయోత్సవ ర్యాలీకి వర్షం అడ్డంకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయంత్రం జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ ర్యాలీకి వర్షం అడ్డు పడింది. ర్యాలీ మధ్యలో ఉండగా భారీ వర్షం కురిసింది. దీంతో నాయకులు, కార్యకర్తలు చెల్లా చెదురయ్యారు. గంటపాటు వర్షం కురియడంతో ర్యాలీని అర్థంతరంగా నిలిపి వేశారు. వర్షం తగ్గిన అనంతరం సభను షెట్కార్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేశారు. దత్తగిరి కాలనీ నుంచి ప్రారంభమైన ర్యాలీ బ్లాక్‌రోడ్డు వరకు చేరుకోగానే వర్షం మొదలైంది. వర్షం ఎంతకూ తగ్గక పోవడంతో అర్థంతరంగా రద్దు చేసి సభ నిర్వహించారు. ఆడి పాడిన గీతారెడ్డి విజయోత్సవ ర్యాలీలో మాజీ మంత్రి గీతారెడ్డి ఆడి పాడారు. ర్యాలీలో మహిళలు బతుకమ్మను బోనాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ పాట పాడుతూ ఆడారు. తలపై బోనం ఎత్తుకుని సంతోషాన్ని పంచుకున్నారు. ర్యాలీలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. గీతారెడ్డి అల్లుడు సుధీర్‌రెడ్డిని పార్టీ కార్యకర్తలు గుర్రంపై కూర్చోబెట్టి ఊరేగించారు. -
‘ప్రత్యేకం’ తెలంగాణ ప్రజల విజయం
యాచారం, న్యూస్‌లైన్ : ఆరు దశాబ్దాల ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతోందని, ఇది తెలంగాణ ప్రజల సమష్టి విజయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఓ వివాహానికి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల పోరాటం, యువత బలిదానాల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర పునర్విభజనకు నిర్ణయం తీసుకుందని, పార్లమెంటులో బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి కూడా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ అప్పట్లోనే రాష్ట్రం నుంచి ఢిల్లీకి ప్రతినిధుల బృందాన్ని పంపించడంలో వైఎస్ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో వైఎస్సార్ సీపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయపక్షాలు కృషి చేయాల్సి ఉందని, ఈ విషయంలో వైఎస్సార్ సీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని, పార్టీ ఆశయాలు... ప్రణాళికలను వివరించి ప్రజల మద్దతు కూడగడతామన్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్‌కు సాగునీటి కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని అన్నారు. మూడేళ్ల తర్వాత సమృద్ధిగా వర్షాలు కురిసి బోరుబావుల్లో నీళ్లున్నా విద్యుత్ కోతలతో సాగుచేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరాలో గంట కోత విధించడం, నాణ్యత లేని కరెంటుతో పంటలు చేతికందుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. నాణ్యమైన ఏడు గంటల విద్యుత్ ఇవ్వకుంటే జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అంతకుముందు ఈసీ శేఖర్‌గౌడ్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, నందివనపర్తి సర్పంచ్ రాజునాయక్ చెల్లెలు విజయ, సూర్యల వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో యాచారం సర్పంచ్ మారోజ్ కళమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నాయిని సుదర్శన్‌రెడ్డి, మండల కన్వీనర్ మోతీరాంనాయక్, నాయకులు రెడ్డి వెంకట్‌రెడ్డి, దార నర్సింహ, నస్దిక్‌సింగారం ఉప సర్పంచ్ చింతపల్లి వరప్రసాద్‌రెడ్డి, మారోజ్ శ్రీనువాస్, ప్రశాంత్‌రెడ్డి, భూపతిరెడ్డి, బుచ్చానాయక్ తదితరులు ఉన్నారు. -
‘టీ’ఎజెండా
ఎన్నో ఏళ్ల పోరాటం.. ఫలించే వేళ ఆసన్నమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ వాసుల కల నెరవేరే సమయం సమీపించింది. గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు టీ బిల్లు రానుంది. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ఏం మాట్లాడుతారనే అంశంపై ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. ‘సాక్షి’ ఈ ప్రయత్నమే చేసింది. ఎమ్మెల్యేల గళం ఎలా ఉంటుందో తెలుసుకుంది. అత్యధిక మంది తెలంగాణ సాధనే తమ లక్ష్యమని చెప్పారు. నీటి వాటా కోసం నిలదీస్తామని, పరిహారం కోసం పట్టుబడతామన్నారు. స్థానిక సమస్యలను ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పాలమూరు, న్యూస్‌లైన్: అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ అంశం ప్రధానం కావడంతో జిల్లా చెందిన శాసన సభ్యులు దానిపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సభను సాఫీగా నడిపేందుకు యత్నిస్తామని చెబుతున్నారు. తెలంగాణ బిల్లును ఆమోదింప జేయడమే తమ ప్రధాన లక్ష్యమని వివరిస్తున్నారు. జిల్లా నుంచి 14 మంది శాసన సభ్యులు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నారుు. ఈ నేపథ్యంలో వీరు ఏ సమస్యలపై తమగళం ఏమని వినిపిస్తారోనంటూ జనం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా సాగునీటి సమస్య పట్టి పీడిస్తోంది. ఈ పరిస్థితుల్లో బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు రైతాంగాన్ని మరింత అయోమయానికి గురిచేస్తోంది. కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు సాగునీరు చేరేపరిస్థితి లేకుండా పోయింది. దీనికితోడు ఆర్డీఎస్కు నాలుగు టీఎంసీలు పెంచినట్లు ప్రకటించారు. ఆ పెంచిన నీటివాటా మనజిల్లా వైపు మళ్లిస్తారా లేదా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనే ఆర్డీఎస్ద్వారా సాగునీళ్లు అందడంలేదు. దీనిపై ప్రజా ప్రతినిధులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. జిల్లాకు సాగునీటిని రాబట్టలేకపోతే నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు దిష్టిబొమ్మలా మారే ప్రమాదం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలకు నిధుల మంజూరు లేదు. దీనికితోడు అక్టోబర్, నంబరు నెలల్లో వరుసగా తుపాన్ వచ్చి పంటలు దెబ్బతిన్నాయి. ఇల్లు కూలిపోవడం, ఇతర ఆస్తి నష్టాలతోపాటు పశువులు చనిపోయాయి. మనుషులు కూడా మృత్యువాత పడ్డారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయం అందలేదు. అకాలవర్షాలతో పంటలకు రూ.800 కోట్ల వరకు నష్టం కలిగినట్లు తెలుస్తోంది. బాధితులకు త్వరితగతిన ఆర్థిక సహాయం అందేలా ప్రజాప్రతినిధులు కృషిచేయాలని జిల్లాలోని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను నిధుల కొరత పట్టిపీడిస్తోంది దీనిపై కూడా శాసన సభ్యులు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణపై..! ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి నుంచి శాసన సభకు పంపనున్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత నాయకులు దాన్ని అడ్డుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆమోదింపచేసుకునేందుకు ఎమ్మెల్యేలు తమ వంతుగా బాధ్యత వహించాలని తెలంగాణ వాదులు కోరుతున్నారు. -
మళ్లీ కాక
నాగపూర్: శాసనసభ శీతాకాల సమావేశాలకు ముందే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కనున్నాయి. విదర్భవాదులంతా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరసనలకు దిగనున్నారు. ఇందులోభాగంగా యువనాయకుడు ఆశిష్ దేశ్‌ముఖ్ వచ్చే నెల ఆరో తేదీనుంచి నిరాహార దీక్షకు దిగనుండగా, విదర్భ సంయుక్త కార్యాచరణ కమిటీ (వీజాక్) మాక్ ఐదు, ఆరు తేదీల్లో అసెంబ్లీ నిర్వహించనుంది. దీంతోపాటు శాసనసభ సమావేశాల ప్రారంభం కానున్న తొలిరోజే బంద్ నిర్వహించాలని స్థానిక నాయకుడు జాంబువంత్‌రావ్ ధోతే నేతృత్వంలోని ఫార్వర్డ్ బ్లాక్‌తోపాటు వివిధ పార్టీలు నిర్ణయించాయి. వచ్చే నెల 16వ తేదీన నిర్వహించే నిరసనలు, కార్యకలాపాలను ఆధారంగా చేసుకుని విదర్భకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించే అంశానికి ప్రజల మద్దతు ఏస్థాయిలో ఉందనే విషయాన్ని ఆయా పార్టీలు నిర్ణయించుకుంటాయి. కాగా పట్టణంలోని సంవిధాన్ స్క్వేర్ ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టాలని భావించిన ఆశిష్ దేశ్‌ముఖ్... అనుమతి కోసం పోలీసు శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందుకు వారు నిరాకరించారు. దీంతో ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలోని భాస్కర్ భవన్ ప్రాంతాన్ని ఆయన తన దీక్షకు వేదికగా ఎంచుకున్నారు. తాను తలపెటి నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమానికి వివిధ సంఘాలు మద్దతు పలికేందుకు సుముఖత వ్యక్తం చేశాయని ఆశిష్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఇదిలాఉండగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ అంశం కూడా తెరపైకి రావాలని ప్రత్యేక విదర్భవాదులు భావిస్తున్నారు. మూడే ళ్ల క్రితం వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఇందుకోసం తీవ్ర కృషి చేశారు. ప్రత్యేక విదర్భవాదానికి బీజేపీతోపాటు కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్పీఐలకు చెందిన నాయకులు కూడా అప్పట్లో మద్దతు పలికిన సంగతి విదితమే. ఉద్యమానికి ఊపు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీసీసీ మాజీ అధ్యక్షుడు రంజిత్ దేశ్‌ముఖ్ కుమారుడైన ఆశిష్... ప్రత్యేక విదర్భకోసం ఈ ఏడాది అక్టోబర్‌లో పట్టణంలోని షాహిద్ చౌక్ నుంచి సేవాగ్రామ్‌దాకా పాదయాత్ర నిర్వహించారు. గాంధీ జయంతినాడు ఆ యాత్ర ముగిసింది. యువత సహకారంతోవచ్చే నెల ఆరో తేదీన చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షతో ఈ ఉద్యమం ఇంకా బలపడేందుకు తోడ్పడొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి రెఫరెండంతో స్ఫూర్తి గతంలో అమరావతి పట్టణంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)కు అనూహ్య స్పందన లభించింది. ప్రత్యేక విదర్భ రాష్ట్రం కావాలంటూ 85 శాతం మంది ప్రజలు ఓటేశారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న విదర్భవాదులు నాగపూర్లోనూ ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. జన్‌మంచ్ అనే పౌర సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. వచ్చే నెల మూడో వారంలో పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సదరు సంస్థ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆ సంస్థకు చెందిన శరద్‌పాటిల్, చంద్రకాంత్ వాంఖడేలు శుక్రవారం వెల్లడించారు. ఇందుకోసం ఆ రోజున పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతా ల్లో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేస్తామన్నారు. భాగస్వాములు కండి ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములు కావాలని విదర్భ వికాస్ పరిషత్ వ్యవస్థాపకుడు, ఎంపీ దత్తా మేఘే ప్రజలకు పిలుపునిచ్చారు. -
అమరజీవే స్ఫూర్తి
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ఆశయంతో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి, అశువులు బాశారు. ఆ మహనీయుని ప్రాణ త్యాగం తెలుగుజాతి పురోభివృద్ధికి ఆదర్శం. ఇదే స్ఫూర్తితో ప్రజలు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తగిన సహకారం అందించాల’ని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ కోరారు. శుక్రవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై... జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జిల్లా జడ్జి వెంకటేశ్వరరావు, డీఐజీ బాలకృష్ణ, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఏజేసీ జయచందర్, జెడ్పీ సీఈఓ విజయేందిర, డీఆర్వో హేమసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగుజాతి చరిత్ర ఉన్నంత వరకు అమరజీవి ఘనకీర్తి విరాజిల్లుతూనే ఉంటుందన్నారు. దేశంలో తెలుగు సంస్కృతికి, మధురమైన తెలుగు భాషకు విశిష్ట స్థానం ఉంద న్నారు. దీన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజల భాషలో పాలనా వ్యవహారాలను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 552 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా... ఇప్పటి వరకు 436 మి.మీ నమోదయ్యిందని తెలిపారు. మొక్కల పెంపకం విరివిగా చేపట్టి వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా జిల్లాలో కరువు నివారణకు కృషి చేస్తామన్నారు. పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత దగ్గర చేయడానికి రెవెన్యూ డివిజన్లలో ‘ప్రజావాణి’ ప్రారంభించామని తెలిపారు. వడ్డీలేని పంట రుణాల పథకం ద్వారా ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలో 5.70 లక్షల మంది రైతులకు రూ.2,658 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ.2,509 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఖరీఫ్-2012 ఇన్పుట్ సబ్సిడీ రూ.648.88 కోట్లకు గాను ఇప్పటి వరకు 3.49 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.350 కోట్లు జమ చేశామని తెలిపారు. మిస్‌మ్యాచింగ్ ఖాతాలను సరిచేసి మిగిలిన మొత్తంతో పాటు త్వరలో రెండో విడతగా 24 మండలాల రైతులకు పరిహారం అందిస్తామన్నారు.జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు రూ.7,676 కోట్లతో రూపొందించిన ‘ప్రాజెక్ట్ అనంత’ అమలుకు జిల్లా స్థాయి కమిటీని, ప్రత్యేక అధికారి నియామకం చేపట్టినట్లు గుర్తు చేశారు. త్వరలో 600 అంగన్వాడీ కార్యకర్తల నియామకానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఏడో విడత భూపంపిణీ కోసం ఇప్పటి వరకు 9,538 ఎకరాలు గుర్తించామన్నారు. బీర్జీఎఫ్ కింద రూ.38.56 కోట్లతో 2,571 పనులు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు సాంబమూర్తిని జిల్లా కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, పట్టుపరిశ్రమశాఖ జేడీ అరుణకుమారి, ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, డీఎస్ఓ శాంతకుమారి, పౌరసరఫరాల డీఎం వెంకటేశం, డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి, డ్వామా పీడీ సంజయ్ప్రభాకర్, నగర పాలక సంస్థ కమిషనర్ టి.రంగయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రభాకరరావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ రామసుబ్బారావు, హౌసింగ్ పీడీ ప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్ఈ రవికుమార్, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, మెప్మా పీడీ మల్లీశ్వరిదేవి, కంటి వైద్య నిపుణులు అక్బర్‌సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
‘జై’ కొడతారా?
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు నిర్ణయంపై కాంగ్రెస్‌పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపేందుకు ఆ పార్టీ నేతలు జైత్రయాత్రలు నిర్వహిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలు మాత్రం జైత్రయాత్రలు విజయవంతం కాకుండా ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణపై సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం చకచకా నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ఇన్నాళ్లూ స్తబ్ధతగా ఉన్న కాంగ్రె స్ నేతలు తామే తెలంగాణ తెచ్చామని చెప్పుకునేందుకు ఈనెల 29న గద్వాలలో జైత్రయాత్ర నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు. అందులో భాగంగానే మంత్రి డీకే అరుణతో పాటు జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి గద్వాలలో నిర్వహించతలపెట్టిన జైత్రయాత్ర కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేవరకు ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటును నమ్మలేమని, ఆ తర్వాతనే సంబరాలు చేసుకుందామని టీఆర్ఎస్ నేతలు పదేపదే ప్రకటిస్తున్నారు. ఇదే విషయాన్ని శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా ప్రస్తావించారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాతే పార్టీ విలీనం గురించి ఆలోచిద్దామంటూ పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం పూర్తికాకుండానే తెలంగాణ వచ్చేసిందనే రీతిలో సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులు, విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించినందుకు జైత్ర యాత్రలు చేస్తున్నారా? అంటూ టీఆర్ఎస్ నేతలు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగా పాలు పంచుకోకపోవడంతో జిల్లాలో ఆ పార్టీ వెనకబడిందని చెప్పొచ్చు. తెలంగాణ ప్రకటన తర్వాత ఆ లోటును పూడ్చుకునే ప్రయత్నంలో భాగంగా నెలన్నర క్రితం విజయోత్సవ సభల పేరుతో ర్యాలీలు, అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో ఇటీవల సమావేశాలు నిర్వహించారు. అయినప్పటికీ ఆశించిన మేర కాంగ్రెస్‌పార్టీకి జనంలో స్పందనరాకపోవడంతో అధిష్టానవర్గం సూచనల మేరకు జైత్రయాత్రలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ రాకుండా అడ్డుకుంటామని చెబుతుంటే జైత్రయాత్రలు ఏవిధంగా నిర్వహిస్తారంటూ టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. పాపం ‘తమ్ముళ్లు’! కాంగ్రెస్, టీఆర్ఎస్ల పరిస్థితి ఇలాఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు కళ్ల విధానం ఆ పార్టీనేతలకు తలనొప్పిగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కు అనుకూలమంటూనే సీమాంధ్ర ప్రాంతానికి అన్యా యం జరుగుతోందంటూ చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయ డం జిల్లా నేతలకు మింగుడుపడని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా బలహీనపడిందని చెప్పొచ్చు. తమ ఉద్యమాల వల్లే రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ మొదలైందని టీఆర్ఎస్, తమ పార్టీ నిర్ణయం తీసుకోవడం వల్లే రాష్ట్రం ఏర్పాటవుతుందని కాంగ్రెస్ నేతలు హడావుడి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం ఏం చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. -
‘చేయి’ కలుపుతాం!
తెలంగాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న విధానంతో ఆ పార్టీ నాయకుల దిమ్మ తిరిగి పోతోంది.. తెలంగాణకు అనుకూలంగా బాబు లేఖ ఇవ్వడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందని టీటీడీపీ నేతలు కాలరు ఎగరేస్తున్నారు. కానీ, వాస్తవ తీరు అందుకు విరుద్ధంగా ఉండడంతో పాలుపోని తమ్ముళ్లు టీడీపీకి నీళ్లొదిలి కాంగ్రెస్ శరణుజొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు..!! సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లా టీడీపీలో ఇపుడంతా అయోమయం రాజ్యమేలుతోంది. తమ అధినేత తీరుతో ఏమీ పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి, తుంగతుర్తి, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకున్న ఆ పార్టీ కొంతలో కొంతనయం అనిపించుకుంది. కానీ, గడిచిన మూడేళ్లుగా పార్టీ పరిస్థితి ఏమంత బాగోలేదు. సహకార, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా బయటపడింది. ఈలోగా కాంగ్రెస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడంతో టీడీపీ కుడితిలో పడ్డ ఎలుక లాగా గిలగిల కొట్టుకుంటోంది. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ చంద్రబాబు రోజుకో విధంగా మాట్లాడుతున్న తీరుతో విసిగిపోతున్నారు. ఇక, తమకు రాజకీయ భవిష్యత్ ఉండదన్న భయం పట్టుకున్న ఆ పార్టీ నేతలు ప్రత్యామ్నాయాల వేటలో పడ్డారు. తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్లకు ఊపు వచ్చిందని అభిప్రాయానికి వచ్చిన కొందరు టీడీపీ నాయకులు మాతృపార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడమే బెటరన్న నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ పార్టీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు ఈ మేరకు పావులు కదిపారని తెలుస్తోంది. ఈ వ్యవహారానికి ఢిల్లీ వేదిక అయ్యిందని వినికిడి. తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఈ జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారని తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలుగా పార్టీ మారితే కాంగ్రెస్‌కు లాభం చేకూరడంతో పాటు, టీడీపీని దెబ్బకొట్టినట్లు ఉంటుందని వీరు చెప్పుకున్నారని సమాచారం. అయితే, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఎన్నికల ఖర్చుల కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.3కోట్లు ఇవ్వాలన్న కండీషన్ పెట్టారని అంటున్నారు. అయితే, ఎదురుడబ్బులు చెల్లించి తమ పార్టీలోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదని, పార్టీ తరపున ఎన్నికల ఖర్చులకు డబ్బులు చెల్లించాల్సి వస్తే, అది ముందుగా, ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, బీసీ, వర్గాలకు చెందిన నేతల నియోజకవర్గాల్లో అవసరాన్ని బట్టి ఉంటుందని కాంగ్రెస్ నేతలు జవాబివ్వడంతో వెనుదిరిగారని తెలుస్తోంది. జిల్లాలో వాస్తవ రాజకీయ పరిస్థితిని విశ్లేషించినా, ఈసారి టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ కేడర్‌లో పూర్తిస్థాయిలో నిస్తేజం ఆవరించి ఉంది. తుంగతుర్తిలో తన పరిస్థితి తారుమారైందని గమనించిన ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు సొంత స్థానం ఆలేరుకు తిరుగుటపా కడుతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. కోదాడలో ఎమ్మెల్యే చందర్రావు లాభం లేదనుకున్న తర్వాతే బీసీవర్గానికి చెందిన బొల్లం మల్లయ్యయాదవ్‌కు పచ్చజెండా ఊపి పార్టీలోకి తీసుకున్నారు. టీడీపీ బీసీ డిక్లరేషన్‌లో భాగంగా ఇస్తామని ప్రకటించిన వందస్థానాల్లో కోదాడ ఉంటుందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. దీనిలో భాగంగానే మల్లయ్యయాదవ్‌ను తీసుకున్నారన్న వాదనా ఉంది. ఇదే కనుక కార్యరూపం దాలిస్తే చందర్రావుకు రెడ్‌సిగ్నల్ పడినట్టే. భువనగిరిలో ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డికి గతంలో ఉన్నంత అనుకూలమైన వాతావరణం ఏమీ లేదు. తెలంగాణవాదపు ఓటు ఇక్కడ అత్యంత కీలకం. ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్లో చేరబోతున్నారన్న ప్రచారం కూడా గతంలో ఒకింత జోరుగానే సాగింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే పార్టీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు కాంగ్రెస్ వైపు చూశారని, మంతనాలు జరిపారని అంటున్నారు. అయితే, ఆ ఎమ్మెల్యేలు ఎవరన్నదే ఇపుడు టీడీపీలో హాట్ టాపిక్. -
పెట్టుబడిదారుల వల్లే సీమాంధ్ర ఉద్యమం
జడ్చర్ల టౌన్, న్యూస్‌లైన్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, విద్య, ఉద్యోగాల సమస్య ఉత్పన్నమవుతుంద ని పది మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు తప్పుదోవపట్టిస్తూ సమైక్య ఉద్యమాన్ని చేపట్టారని ఖాదీబోర్డు సౌత్‌జోన్ చైర్మన్ కాళప్ప ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి రాయిచూర్ వెళుతూ మార్గమధ్యంలో జడ్చర్ల ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీటి సమస్య పరిష్కారానికి తుంగభద్రపై ఉన్నట్లుగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బోర్డులను కృష్ణా, గోదావరికి నియమిస్తే ఏ సమయంలో ఎవరికి ఎంత నీళ్లు ఇవ్వాలో తేల్చవచ్చన్నారు. విద్యాపరంగా తెలంగాణ కన్నా అధికంగా సీమాంధ్రలోనే యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. ఐటీ విషయంలోనూ విశాఖ లాంటి పట్టణాల్లో ఎంతో అభివృద్ధి చేసే అవకాశముందన్నారు. అమెరికాలాంటి దేశాల్లో కార్యాలయాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఐటీ ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కేవలం పది మంది పెట్టబడిదారులు వారి జిల్లాలను అభివృద్ధి చేయకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున భూ వ్యాపారాలకు పాల్పడి కోట్లు గడించారని ఆరోపించారు. అభివృద్ధి అంటే నగరం చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు ఆక్రమించి భవనాలు నిర్మించటమేనా? అని ప్రశ్నించారు. సీమాంధ్రలో బడుగు, బలహీనవర్గాల నాయకులే లక్ష్యంగా సమైక్య ఉద్యమం సాగుతోందని విమర్శించారు. ఇంతవరకు బీసీ నాయకుల ఇళ్లపై దాడులు చేశారు కాని ఇతర నాయకులను ఎందుకు లక్ష్యంగా పెట్టుకోలేదో అందరూగ్రహించాలన్నారు. సమావేశంలో డీసీసీ కార్యదర్శి సంజీవ్‌ముదిరాజ్, వాల్మీకి సేవాసమితి రాష్ట్ర నాయకుడు అయ్యన్న, విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షుడు రంగాచారి, కార్యదర్శి వడ్ల శేఖర్, స్వర్ణకారుల సంఘం ఉపాధ్యక్షుడు శేఖరాచారి, న్యాయవాది వినోద్, నాయకులు జగదీశ్, వేణు, తిరుపతయ్య పాల్గొన్నారు. -
డిసెంబర్‌లోగా తెలంగాణ రాష్ట్రం
నకిరేకల్, న్యూస్‌లైన్ సీమాంధ్ర నేతలు ఎన్ని కుట్రలు,కుతంత్రాలు పన్నినా త్రెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని, డిసెంబర్ 2013లోగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతమంది సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నారని, వారు చేస్తున్న ప్రచారం అక్కడి ప్రజలను మోసం చేయడానికేనని ఆరోపించారు. సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న రోజే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని వెల్లడైందన్నారు. రాజ్యాంగపరంగా తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి తప్పు పట్టడం తగదన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా సీఎం వైఖరిని తప్పుపట్టారని, అయినా అదే విధంగా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. వారంలోపే తెలంగాణపై క్యాబినెట్ నోట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని వీడి స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకుల సీమాంధ్రుల అడుగు, నీడల్లో పయనిస్తున్నారని ఎద్దేవా చేశారు. నేర చరిత్ర కలిగిన వారికి రాజకీయాల్లో అవకాశం ఇవ్వకూడదనే బిల్లు ప్రవేశపెట్టాలని రాహుల్‌గాంధీ వాక్యానించడం హర్షణీయమన్నారు. ప్రజలను మోసం చేసే వారికి, మాఫియా లీడర్లకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇవ్వద్దని కోరారు. సమావేశంలో మంగళపల్లి, బోప్పారం సర్పంచ్‌లు ప్రగడపు నవీన్‌రావు, లింగయ్య ఉన్నారు. -
4న ‘అభినందనసభ’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష ను గౌరవిస్తూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కో సం సీడ బ్ల్యూసీ, యూపీఏ సమన్వయ క మిటీ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానం చేయించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపడానికి ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ప్రాంతంలోని మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అభినందన సభలు తెలంగాణ జిల్లాలో నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే మొదటి వేదిక జిల్లాలోని బోధన్ కానుంది. ముహూర్తమూ ఖరారైంది. సెప్టెంబర్ 4న సభ నిర్వహించ నున్నారు. ‘తెలంగాణ’ ప్రకటన నిర్ణయం తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో భారీ జన సమీకరణపై కాంగ్రెస్ నాయకులు దృష్టి సారించారు. సభ విజయవంతం కోసం జిల్లాకు చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి తగిన కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీలు డి.శ్రీనివాస్, షబ్బీర్‌అలీ, ప్రభుత్వ విప్ అనిల్, మాజీ స్పీకర్ కేఆర్.సురేశ్‌రెడ్డిలు సైతం ప్రత్యేక దృష్టి సారించారు. బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజక వర్గాలు మినహాయిస్తే జిల్లాలో విజయోత్సవ సంబరాల పేరుతో కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలు నిర్వహించింది. అందువల్లే సోనియా అభినందన సభను బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. సభకు రావాల్సిందిగా కోరుతూ తెలంగాణ ప్రాంతంలోని ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులకు డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ లేఖలు రాయనున్నారు. ఈ సభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు కే.జానారెడ్డి, డీకే.అరుణ, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని అధికార పార్టీ నాయకులు తెలిపారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామేనన్న మాటను నిలబెట్టుకున్నందునే సంబురాలు జరుపుకుంటున్నామని ఆధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఎన్నికలే లక్ష్యంగా... సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు సభలు నిర్వహిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నాటికి నియోజక వర్గాల్లో బలాన్ని పెంచుకోవడంతో పాటు కేడర్ ను సన్నద్ధం చేయడం ద్వారా సీటును పదిలపరచుకోవడానికి ఆశావహులు ఇప్పటికే తెలంగాణ విజయోత్సవ సంబురాలు జరిపారు. ప్రథమంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ నిజామాబాద్‌లో తెలంగాణ విజయోత్సవ సభ నిర్వహించారు. మరో ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ కామారెడ్డిలో సభ ఏర్పాటు చేశారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి కూడా విజయోత్సవ ర్యాలీ తీశారు. రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ వేగవంతంపై దృష్టి సారించకుండా సంబరాలకే పరిమితమైతే ఎలా అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నప్పటికీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రచారంపైనే దృష్టి సారించడం గమనార్హం. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తన ఘనతేనని కొందరు గొప్పలకు పోతున్నారని, వాటికి చెక్ పెట్టడానికే ఇలాంటి సభలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చలువ, తెలంగాణ కాంగ్రెస్ నేతల సమష్టి కృషి వల్లే రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిందన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించి వారీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
ఎమ్మెల్సీలకు పదవీ గండం!
ఖమ్మం, న్యూస్‌లైన్: ఎమ్మెల్సీలకు పదవీ గండం పొంచి ఉందా...ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో సర్వత్రా జరుగుతున్న చర్చ ఇది. ఏదైనా ఒక రాష్ట్రంలో శాసన మండలి ఉండాలంటే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 120కి పైగా ఉండాలని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. లేకపోతే అక్కడి మండలి రద్దు చేయాల్సిందే అని చెబుతున్నారు. ఈ లెక్కన 10జిల్లాలతో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో కేవలం 119 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. శాసనమండలి ఉండాలంటే ఒకస్థానం తక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో సరిపడా సంఖ్య లేనందున రాష్ట్ర శాసన మండలి రద్దు అనివార్యం అని రాజ్యాంగ విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంట్లో ప్రత్యేక సవరణ చేసి బిల్లు పాస్ చేస్తే తప్ప ప్రత్యేక రాష్ట్రంలో శాసన మండలి ఉండే అవకాశం లేదు. దీంతో జిల్లాలో ఐదుగురు మండలి సభ్యులకు పదవీగండం పొంచి ఉన్నట్లు స్పష్టం అవుతోంది. శాసనమండలి రద్దు పరిస్థితే వస్తే... శాసనసభ్యుల కోటాకింద టీడీపీ నుంచి ఎంపికైన బాలసాని లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల సభ్యుల కోటాలో ఎంపికైన పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎంపికైన కపిలవాయి దిలీప్‌కుమార్‌లు అటుఇటుగా పదిహేను నెలలకు ముందుగానే పదవిని వదులుకోవాల్సి ఉండగా, రెండోసారి మండలికి ఎంపికైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఐదుసంవత్సరాల పదవీకాలం కోల్పోయే పరిస్థితి తలెత్తనుంది. ఇక ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎంపికైన పూలరవిందర్ పదవి మూనాళ్ల ముచ్చటగానే మారొచ్చని అంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై సంతోషంగా ఉండాలో పదవి పోతున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో మన నాయకులు కొట్టుమిట్టాడుతున్నారు. రాజకీయ భవిష్యత్తుపై చర్చలు.... పదవీకాలం ముగియక ముందే పదవిని కోల్పోయే పరిస్థితి నెలకొంటే నాయకుల రాజకీయ భవితవ్యం ఏమిటనే చర్చ నడుస్తోంది. 2004లో ఖమ్మం అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన బాలసాని లక్ష్మీనారాయణను ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికచేశారు. ఆయన పోటీచేసిన ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు 2009లో పోటీచేసి గొలుపొందారు. అదేవిధంగా పార్టీలో పనిచేసి అవకాశం కోసం ఎదురు చూస్తున్న పోట్ల నాగేశ్వరరావు స్థానిక సంస్థల ప్రతినిధుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు వీరి రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకం. జిల్లాలో మూడు జనరల్ స్థానాలు ఉండగా పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి ఏ స్థానం కేటాయిస్తారో తేల్చిచెప్పలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో టీడీపీకి దక్కే ఒకటి, రెండు జనరల్ స్థానాల్లో తీవ్రమైన పోటీ నెలకొననుంది. అదేవిధంగా రెండోసారి మండలికి ఎంపికైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎక్కడ ప్రాతినిధ్యం వహిస్తారో అనేది చర్చ. ఇటీవల ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం, పార్టీ సమావేశాల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి స్థానికులే పోటీ చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యల వెనక రాజకీయ వ్యూహం ఉండివుంటుందని భావిస్తున్నారు. తనకు ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధంతో ఆయన ఖమ్మం ఎంపీగా పోటీచేస్తారా.. అనే చర్చ లేకపోలేదు. ఖమ్మం, వరంగల్, నల్గొండ విద్యావంతుల నియోజవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కపిలవాయి దిలీప్‌కుమార్ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక కూటమితో ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో ఎన్నికల్లో పోటీ చేస్తారా? తనకు ఉన్న సంబంధాలతో మరో నామినేటెడ్ పదవి తెచ్చుకుంటారో వేచిచూడాలి. ఇక ఇంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేసిన పూలరవిందర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ టీచర్స్ జేఏసీ కన్వీనర్‌గా పనిచేసి అందరితో పరిచయాలు పెంచుకున్నారు. ఇప్పుడు మండలి రద్దు అయితే రాజకీయ భవితవ్యం ఏమిటనేది ప్రశ్నార్థకం. రాజకీయాలకు దూరంగా ఉంటారా.. లేదా ఏదో ఒక పార్టీలో చేరి ప్రత్యామ్నాయం వెతుక్కుంటారా అనేది జిల్లాలో చర్చనీయాంశం. -
వైఎస్సార్ సీపీని దెబ్బతిసేందుకు కుట్ర
జహీరాబాద్ టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణలో వైఎస్సార్ సీపీకి లభిస్తోన్న ఆదరణను చూసి జీర్ణించుకోలేక కొందరు తమ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఎస్.ఉజ్వల్‌రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకమంటూ దుష్ర్పచారం చేయడం కుట్రలో భాగమని ఆయన అన్నారు. శనివారం జహీరాబాద్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ ధోరణిని అవలంబిస్తుండడం వల్లే తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సి వచ్చిందన్నారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, స్పష్టమైన విధివిధానాలు ప్రకటించాలని మాత్రమే కోరడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణకు వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని, ఈ ప్రాంతంలోనూ తమ పార్టీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధినేతగా ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ప్రాంతానికి కొత్త నాయకుడిని ప్రకటించడం జరుగుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, టీడీపీ, ఇతర జాతీయ పార్టీలు మాత్రమే ఉంటాయని, టీఆర్ఎస్ ఒక్కటే ఉండదని ఆయన స్పష్టం చేశారు. పదిరోజులపాటు నిద్రపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కసారిగా మేల్కొని రాజకీయ లబ్ధి కోసం ప్రధానికి లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ రావడం ఏ మాత్రం ఇష్టం లేకనే ఆయన ఆ ఉత్తరం రాశారని ఉజ్వల్‌రెడ్డి విమర్శించారు. గ్రామస్థాయి నుంచి వైఎస్సార్ సీపీని బలోపేతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ఎస్.నారాయణ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి మాణిక్‌రావు, పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అలీ, నాయకులు క్రిష్టఫర్, అరుణ్‌కుమార్, అక్తర్ ఆహ్మద్, ముబిన్ లష్కర్, గిరిధర్‌రెడ్డి, బాబుకుమార్, కలీమొద్దీన్, జగన్ తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ యూత్ పట్టణ కమిటీ రద్దు- గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడి సంగారెడ్డి డివిజన్:వైఎస్సార్ సీపీ యువజన విభాగం జహీరాబాద్ పట్టణ కమిటీని రద్దు చేసినట్టు పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి శనివారం ప్రకటించారు. యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రస్తుత కమిటీని రద్దు చేశామన్నారు. త్వరలో కసరత్తు పూర్తి చేసి నూతన కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సొంత ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆయన దుయ్యబట్టారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేందుకే సీఎం కిరణ్ అనవసర ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని శ్రీధర్‌రెడ్డి దుయ్యబట్టారు.