
స్మృతి డిగ్రీ రికార్డులు తీసుకురండి: ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: కేంద్ర హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీ విద్యాభ్యాసానికి సంబంధించిన రికార్డులు తీసుకురావాలంటూ.. ఎన్నికల సంఘం, ఢిల్లీ యూనివర్సిటీలను ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. మంత్రి తన విద్యాభ్యాసంపై తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ.. దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది.