జయంతిని ప్రశ్నించనున్న సీబీఐ?
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పర్యావరణ అనుమతులపై సీబీఐ విచారణ చేపడుతోంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా జయంతీ నటరాజన్ ఐదు కంపెనీలకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, మైనింగ్ హక్కులకు సంబంధించిన అవకతవకలపై సీబీఐ ఐదు ప్రాథమిక విచారణలను నమోదు చేసింది. సీబీఐ త్వరలో జయంతీ నటరాజన్ను ప్రశ్నించే అవకాశముంది. సీబీఐ ఇటీవల పర్యావరణ శాఖ అధికారులను, జార్ఖండ్ అధికారులను ప్రశ్నించి పలు డాక్యుమెంట్లు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.
జయంతి.. రాహుల్ గాంధీలపై తీవ్ర ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. యూపీఏ హయాంలో ఇచ్చిన/నిరాకరించిన పర్యావరణ అనుమతులపై సమీక్ష చేపడతామని కేంద్రం ప్రకటించింది.