బుఖారీ, సోనియా భేటి వార్తలు అవాస్తవం: కాంగ్రెస్
ఢిల్లీ షాహీ ఇమామ్ సయ్యద్ ఆహ్మద్ బుఖారీతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమావేశమైనట్టు వచ్చిన వార్తల్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది.సోనియా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది
న్యూఢిల్లీ: ఢిల్లీ షాహీ ఇమామ్ సయ్యద్ ఆహ్మద్ బుఖారీతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమావేశమైనట్టు వచ్చిన వార్తల్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది.సోనియా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ అన్నారు.
బుఖారీతో సోనియా భేటి కాలేదని.. ఆవార్తలన్ని అవాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. బుఖారీతో సమావేశమైనట్టు ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమీషన్ పరిగణనలోకి తీసుకుంటుందనే విషయాన్ని ఆయన మీడియా దృష్టికి తీసుకువచ్చారు.
అంతేకాకుండా ఓట్లు పొందేందుకే మాంసం ఎగుమతి అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన నఅ్నారు. దేశంలో గోవధపై నిషేధం విధించారని, మాంసం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ లోనే మాంసం ఎగుమతి జోరుగా సాగుతోందని ఆయన ఆరోపించారు.