వైబ్ సైట్లో వాజ్ పేయి పేరు, సోనియాపై కేసు!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై మధ్యప్రదేశ్ బీజేపీ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భోపాల్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై మధ్యప్రదేశ్ బీజేపీ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ వెబ్ సైట్ లో మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి పేరుతో తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయడంపై బీజేపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుజరాత్ లో జరిగిన మత ఘర్షణల తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలనుకున్న నరేంద్రమోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎలా ప్రతిపాదిస్తారని వాజ్ పేయి చేసినట్టు వచ్చిన వ్యాఖ్యలను వెబ్ సైట్ లో కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ తీరును బీజేపీ నేతలు తప్పుపడుతూ కేసు నమోదు చేశారు.