అభివృద్ధి చెందిన దేశాల కంటే సమర్థవంతంగా కరోనా కట్టడి 130 కోట్ల జనాభా ఉన్న దేశం.. అరకొరగా వైద్య సదుపాయాలు కలిగిన దేశం. కంటికి కనిపించని శత్రువుపై అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించింది. కరోనా వైరస్ భారత్‌లో అల్లకల్లోలం సృష్టిస్తుందని అంచనా వేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు మన దేశాన్ని వెన్నుతట్టి ప్రశంసిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల కంటే కరోనా కొమ్ములు విరచడంలో మనమే ముందున్నాం. అయినప్పటికీ మే3న లాక్‌డౌన్ ఎత్తివేయాలా వద్దా అన్న మీమాంస కొనసాగుతోంది.
పరీక్షా సమయం
కోవిడ్–19 పరీక్షలు చేయడంలోనూ భారత్ కాస్త వెనుకబడి ఉన్నప్పటికీ పాజిటివ్ కేసులు ఎక్కువగా రాకపోవడం ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు 8 లక్షల 50 వేల మందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో అందరికీ ఆదర్శంగా నిలిచిన దక్షిణ కొరియా కంటే సంఖ్యలో ఇది ఎక్కువ. కానీ జనాభా ప్రాతిపదికన చూస్తే మాత్రం స్వల్పమే. చాలా తక్కువ కేసులు నమోదైన వెంటనే భారత్ మేల్కొంది. లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి తగ్గిపోయింది. ఫలితంగా కేసుల సంఖ్యను నివారించింది’
– లక్ష్మీనారాయణ్, సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకానమిక్స్, పాలసీ డైరెక్టర్
ముందస్తుగా లాక్‌డౌన్
ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే లాక్‌డౌన్‌పై భారత్ చాలా చురుగ్గా స్పందించింది. చాలా తక్కువ కేసులు నమోదవగానే లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రకటించింది. ఏయే దేశాలు ఎన్ని కేసులు నమోదయ్యాక లాక్‌డౌన్ ప్రకటించాయంటే..
భారత్ భళా
Published Fri, May 1 2020 4:05 AM | Last Updated on Fri, May 1 2020 5:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment