
‘టీవీ చానళ్ల వల్లే రేప్‌లు’
న్యూఢిల్లీ/లక్నో:ఉత్తరప్రదేశ్‌లో పెరిగి పోతున్న అత్యాచార ఘటనలపై ఆ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు తలా తోకా లేని వాదనలు చేస్తున్నారు. అసలు రేప్‌లు పెరిగిపోవడానికి టీవీ చానళ్లే కారణమని వాదిస్తున్నారు. కొందరు విలేకరులు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ముందు బదౌన్ దారుణాన్ని ప్రస్తావించగా.. ‘మీరు మీ పని చేసుకోండి..
మేం మా పని చేసుకుంటాం..’ అంటూ రుసరుసలాడారు. సీఎం అఖిలేష్ సైతం బాధ్యతారహితంగా మాట్లాడారు. గూగుల్‌లో చూస్తే ఇలాంటి సంఘటనలు దేశమంతా కనిపిస్తాయన్నారు. చానళ్ల కార్యక్రమాల్లో అశ్లీలత, హింస పెరిగిపోవడం వల్లే ఘోరాలు జరుగుతున్నాయని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ అన్నారు.