ఎగ్జిట్ పోల్స్లో మళ్లీ మోదీ హవా! | Exit poll of Maharashtra and Haryana | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్ పోల్స్లో మళ్లీ మోదీ హవా!

Published Wed, Oct 15 2014 7:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఎగ్జిట్ పోల్స్లో మళ్లీ మోదీ హవా! - Sakshi

ఎగ్జిట్ పోల్స్లో మళ్లీ మోదీ హవా!

ముంబై: శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో ప్రధాని మోదీ హవా కొనసాగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ భారీగా లాభపడనుంది. అయితే మహారాష్ట్రలో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేదని ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీయే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించనుంది.

సిఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ 129 శాసనసభ స్థానాలు, కాంగ్రెస్ 43, శివసేన 56, ఎన్సీపి 36, ఎంఎన్ఎస్ 12, ఇతరులు 12 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. హర్యానాలోని 90 స్థానాలలో బీజేపీ 37, ఐఎన్ఎల్డీ 28, కాంగ్రెస్ 15, హెచ్జేసీ 6, ఇతరులు 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది.

ఏబీపీ ఛానల్ ఎగ్జిట్పోల్స్ ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ 127 స్థానాలు, శివసేన 77, కాంగ్రెస్ 40, ఎన్సీపీ 34, ఎంఎన్ఎస్ 5, ఇతరులు 5 స్థానాలలో గెలిచే అవకాశం ఉంది. హర్యానాలో బీజేపీ 46, ఐఎన్ఎల్డీ 29, కాంగ్రెస్ 10, హెచ్జేసీ 2, ఇతరులు 3 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement