ఆలస్యంగా వచ్చిందని తండ్రి ఎంతపని చేశాడు? | Father stabs girl for returning late in delhi | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా వచ్చిందని తండ్రి ఎంతపని చేశాడు?

Published Sun, Sep 18 2016 3:52 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

ఆలస్యంగా వచ్చిందని తండ్రి ఎంతపని చేశాడు?

ఆలస్యంగా వచ్చిందని తండ్రి ఎంతపని చేశాడు?

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఆలస్యంగా వచ్చిందని ఓ కూతురుని కన్నతండ్రి ఇష్టం వచ్చినట్లు కొట్టి కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఐదు రోజులపాటు ఆ అమ్మాయిని ఇంట్లో పడేసి తాళం వేసి ఉంచాడు. ఎట్టకేలకు ఆ అమ్మాయి తప్పించుకొని బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా తండ్రి పరారయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని రాజ్ నగర్ ప్రాంతంలోని తన బంధువుల ఇంటికి ఆ అమ్మాయి వెళ్లింది.

రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఎక్కడికెళ్లావని ప్రశ్నిస్తూనే ఆమెపై తండ్రి చేయి చేసుకున్నాడు. అనంతరం బాగా కొట్టి కత్తితో గొంతు కోసే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి తప్పించుకొని ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. దీంతో ఆ అమ్మాయిని లోపలే ఉంచి తాళం పెట్టాడు. అనంతరం పోలీసులు అరెస్టు చేస్తారని పారిపోయాడు. ఆ కుటుంబాన్ని ఆ అమ్మాయి తల్లే పోషిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement