భారత్‌లో ఐసిస్ కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ).. సామాజిక మాధ్యమ వేదికలను సాయం కోరింది.
ఐసిస్‌పై వివరాలివ్వాలన్న ఎన్‌ఐఏ
న్యూఢిల్లీ: భారత్‌లో ఐసిస్ కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ).. సామాజిక మాధ్యమ వేదికలను సాయం కోరింది. ఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్, వాట్సాప్‌లో ఐసిస్ భావజాల పోస్టులు గుర్తిస్తే సమాచారం అందించాలని కోరింది. మంగళవారం ముగ్గురు ఉగ్రవాద అనుమానితుల కస్టడీని పొడిగించాలని ఢిల్లీ కోర్టు అనుమతి కోరుతూ ఈమేరక వెల్లడించింది.ఈ ముగ్గురు సామాజిక మాధ్యమంలోనే వివిధ గ్రూపులను గుర్తించి వీటి ద్వారానే ఐసిస్ కోసం నియామకాలపై దృష్టిపెట్టారని తెలిపింది.