
న్యూఢిల్లీ: ఆధార్ వివరాలు కేవలం రూ.500లకే విక్రయిస్తామంటూ వాట్సాప్‌లో కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) పేర్కొంది. ఆధార్ సమాచార వ్యవస్థ చాలా సురక్షితమని.. భద్రంగా ఉంటుందని హామీ ఇచ్చింది. ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడితే సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఆధార్ సమాచారాన్ని పొందే అవకాశం కేవలం రాష్ట్ర ప్రభుత్వం, ఆధార్ ఫిర్యాదులను పరిష్కరించే సంస్థలకు మాత్రమే ఉందని పేర్కొంది.