గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల మహిళలకు లబ్థి చేకూర్చేలా వారికి గ్యాస్ కనెక్షన్లు కల్పించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు
న్యూ ఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల మహిళలకు లబ్థి చేకూర్చేలా వారికి గ్యాస్ కనెక్షన్లు కల్పించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. సోమవారం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆయన బీపీఎల్ కుటుంబాలకు ఎల్పీజీ సౌకర్యం కల్పించేందుకు 1000 కోట్ల రూపాయలను కెటాయిస్తున్నాట్లు ప్రకటించారు.
రాష్ట్రాల బాగస్వామ్యంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోనున్నట్లు తెలిపిన అరుణ్ జైట్లీ.. దీని ద్వారా 5 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు లబ్థి చేకూరుతుందని తెలిపారు. వంట చెరకు ఉపయోగించడం ద్వారా వచ్చే పొగతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆరోగ్యాలు పాడవకుండా ఈ స్కీమ్ దోహదం చేస్తుందన్నారు. అలాగే స్వచ్ఛందంగా ఎల్పీజీ సబ్సిడీని వదులుకున్న 75 లక్షల కుటుంబాలకు అరుణ్ జైట్లీ కృతఙ్ఞతలు తెలిపారు.