న్యూఢిల్లీ: ఈవీఎంల ట్యాంపరింగ్ విషయంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ట్యాంపరింగ్ విషయాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. తాను కూడా ఒక ఐఐటీ ఇంజినీర్‌ను అని, ఈవీఎంలు ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చో తానొక పది మార్గాలు చెబుతానని అన్నారు. శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడిన ఆయన ఈవీఎంల ట్యాంపరింగ్ చేయొచ్చని ఒక ఉదాహరణ కూడా ఎత్తి చూపారు.
పుణెలో ఓ వ్యక్తి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగాడని, ఆ వ్యక్తికి ఒక్క ఓటు కూడా పడినట్లు చూపించలేదని, దాని ప్రకారం కనీసం అతడి ఓటు అయినా చూపించాలి కదా.. మరీ ఆ ఓటు ఏమైనట్లు అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఎందుకు ఈవీఎంల అంశాన్ని ప్రశ్నించరాదు అని అన్నారు. ఇలాంటివి చూస్తూ కళ్లు మూసుకోలేమని చెప్పుకొచ్చారు. బీజేపీకి ఢిల్లీలో ఆమ్‌ఆద్మీపార్టీని ఓడించడమే లక్ష్యం అని, అందుకోసం తమ పార్టీని చీల్చడంతోపాటు ఎలాంటి చర్యలకైనా దిగుతుందని విమర్శించారు.
‘ఈవీఎంల ట్యాంపరింగ్ ఎలాగో నేను చెప్తా’
Published Fri, Apr 14 2017 7:35 PM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM
Advertisement