
రాహుల్.. మీ ఎంపీలను కంట్రోల్ చేయండి
యూఢిల్లీ: లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను నియంత్రించాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ సూచించారు. బుధవారం లోక్సభలో మతహింసపై చర్చ సందర్భంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాహుల్ తమ పార్టీ ఎంపీలతో కలసి స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఆయన పార్టీ ఎంపీలతో కలసి అద్వానీని కలిశారు.
లోక్సభలో జరిగిన సంఘటన పట్ల అద్వానీ మనస్తాపం చెందినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమస్యను పరిష్కరించాల్సిదిగా పార్టీ నాయకులకు సూచించినట్టు సమాచారం. దేశంలో మతహింస పెరిగిపోతున్న విషయంపై వెంటనే సభలో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేయగా.. ప్రభుత్వం నిరాకరించింది. దీంతో లోక్సభలో కాంగ్రెస్ సభ్యులు సభాకార్యకలాపాలను అడ్డుకున్నారు. లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ ఆరోపించగా..ఆ తర్వాత సుమిత్ర ఖండించారు.