అతివృష్టి ప్రభావం సెప్టెంబర్‌లో ఉంటుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలకు అనుకూల వాతావరణాన్ని కల్పించిన లా నినా (అతివృష్టి) ప్రభావం సెప్టెంబర్‌లో ఉంటుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
వాస్తవానికి ఈ సారి వర్షాకాలం ప్రారంభం నుంచే లా నినా ప్రభావం ఉంటుందని భావించినా.. అది కాస్త ఆలస్యమైందని ఐఎండీ డెరైక్టర్ జనరల్ కేజే రమేశ్ తెలిపారు. ఎల్ నినో ప్రభావం తగ్గినందునే సాధారణం కన్నా భారీ వర్షాలు కురిశాయని.. వచ్చే నెల్లో మరింత వర్షాపాతం నమోదు కానుందన్నారు.