చంఢీగర్: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లఘించి తరగతులు నిర్వహిస్తున్న ఓ ట్యూటర్ బాగోతాన్ని ఐదేళ్ల బాలుడు బయటపెట్టాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా బటాలాలో శనివారం ఈ సంఘటన వెలుగుచూసింది. తాతరి మొహల్లా ప్రాంతంలో ఓ వ్యక్తి తన మేనల్లుడు (5), మేనకోడల్ని తీసుకెళ్తూ పోలీసుల కంటబడ్డాడు. చిన్నారులను తీసుకుని ఎక్కడకి వెళ్తున్నారని ప్రశ్నించగా.. అతను పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. అయితే, బాలుడు ఇచ్చి సమాచారంతో వారు ట్యూషన్ క్లాసులకు వెళ్తున్నారని పోలీసులు గ్రహించారు.
(చదవండి: జూలై చివరి వరకూ అదే మంచిది!)
కానీ, పోలీసులు ఆ చిన్నారుల మేనమామ నుంచి ట్యూషన్ నిర్వహిస్తున్న ఇంటి అడ్రస్ రాబట్టలేక పోయారు. దాంతో పోలీసులు మరోసారి బుడ్డోడి సాయం తీసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆ చిన్నారి ట్యూటర్ ఇంటికి స్వయంగా తీసుకెళ్లాడు. రాత్రింబవళ్లు.. మైకులు పెట్టుకుని మరీ చెప్తున్నా.. మీకు వినిపించడం లేదా..? ట్యూషన్ నిర్వహించుకోమని మీకు ప్రత్యేక వెసులుబాటు ఏమైనా కల్పించారా? అని సదరు మహిళా ట్యూటర్‌కు పోలీసులు చీవాట్లు పెట్టారు. మళ్లీ ఇలాంటి తప్పు చేస్తే కటకటాల్లోకి పంపుతామని హెచ్చరించి వదిలేశారు. ఇక అడ్రస్ చెప్పకుండా ఇబ్బంది పెట్టిన చిన్నారుల మామయ్యను పోలీసులు మందలించారు. లాక్‌డౌన్‌లో పిల్లల్ని బయటకు తీసుకెళ్లి వాళ్ల ప్రాణాలను రిస్కులో పెట్టొదని హితవు పలికారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
(చదవండి: వైరల్.. జీవాతో ధోని బైక్ రైడ్)
Comments
Please login to add a commentAdd a comment