రావు జీ.. వర్షాలు పడుతున్నాయా?
కేసీఆర్‌కు ప్రధాని పలకరింపు
- బాగా పడుతున్నాయన్న సీఎం
- కోవింద్ నామినేషన్‌లో మోదీ సరదా వ్యాఖ్యలు
- వాళ్లకున్నాయి గానీ మాకే రెండేళ్లుగా లేవు
- ప్రధానితో చంద్రబాబు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘రావు జీ... వర్షాలు బాగా పడుతున్నాయా?’’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ ప్రక్రియకు హాజరైన సీఎంలతో మోదీ శుక్రవారం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎంను ఆయన పలకరించారు. తెలంగాణలో వానలు బాగా పడుతున్నాయా అని ఆరా తీశారు. బాగానే పడుతున్నాయని సీఎం బదులిచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు కల్పించుకుని, ‘వాళ్లకు రెండేళ్లుగా బాగానే పడుతున్నాయి. మా ప్రాంతంలోనే వర్షపాతం తక్కువగా ఉంది’’అని అన్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్, దేవేంద్ర ఫడ్నవిస్‌లను కూడా ఇదే అంశమై ప్రధాని పలకరించగా తమ రాష్ట్రాల్లో వర్షాలు ఆశించిన మేర లేవని చెప్పారు. ‘మీరు నీటి ప్రాజెక్టుల వెంటపడ్డారు . అందుకే వర్షాలు పడుతున్నట్టున్నాయి’అని కేసీఆర్‌తో ప్రధాని అన్నట్టు సమాచారం.