గయ: కృష్ణాష్టమి పర్వదినం రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం బీహార్ లోని బుద్ధ గయలో పర్యటించారు. ఈ సందర్భంగా మహాబోధి ఆలయంలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బుద్ధుని సన్నిధిలో కొద్దిసేపు ధ్యానం చేశారు.అంతకు ముందు గయ విమానాశ్రయంలో మోదీకి అంతర్జాతీయ బౌద్ధుల సంఘం కార్యదర్శి లామా లోబోజాంగ్, మహాబోధి ఆలయం వద్ద ప్రధాన అర్చకుడు భాంటి ఛాలిందా స్వాగతం పలికారు.
కాగా రెండు రోజుల క్రితం అంతర్జాతీయ బౌద్ధుల సమావేశం ఢిల్లీలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే దాని ముగింపు సమావేశం మాత్రం బుద్ధగయలో జగరనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరు అవుతారు. ప్రధాని పర్యటన సందర్భంగా మరోవైపు ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ) కి చెందిన 16 మంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి.