వాషింగ్టన్: అంగారకుడిపై పరిశోధనలు చేస్తున్న ఉపగ్రహాలకు మరో పనిపడింది. అరుణ గ్రహానికి సమీపం నుంచి దూసుకెళ్లనున్న ‘సైడింగ్ స్ప్రింగ్ (సీ/2013 ఏ1)’ తోకచుక్కను అవి పరిశీలించనున్నాయి. మన జీవితకాలంలో ఒక్కసారే వచ్చే ఈ తోకచుక్క.. ఈ నెల 19న అంగారకుడికి కేవలం 1,39,500 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించనుంది.
ఇది భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరంలో దాదాపు సగం మాత్రమే కావడం గమనార్హం. ఇంత సమీపంలోంచి వెళుతున్నందున.. అంగారకుడి వాతావరణంపై ‘సైడింగ్ స్ప్రింగ్’ చూపే ప్రభావంతో పాటు ఆ తోకచుక్క పరిస్థితిని, నిర్మాణాన్ని పరిశీలించేందుకు అవకాశం కలుగనుంది.
సైడింగ్ స్ప్రింగ్‌పై నాసా కన్ను!
Published Sat, Oct 11 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM
Advertisement
Advertisement