
సాక్షి: ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్‌లో ప్రజలను తప్పుదోవ పట్టించే అంశాలను అరికట్టడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆ సంస్థను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ప్రతీ యూజర్‌కి ఫింగర్ ప్రింట్‌తో కూడిన ఒక డిజిటల్ సంతకం ఉండాలనీ, దీని వల్ల మెసేజ్ లేదా వివాదాస్పద విషయాలు వ్యాప్తి చేసే అసలు వ్యక్తిని గుర్తించవచ్చని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ ద్వారా మనం ఇతరులకు పంపే కంటెంట్‌పై మన డిజిటల్ సంతకం ఉంటుంది.దీంతో ఆయా మెసేజ్‌లను ఎంతమంది చూశారు? ఎంతమందికి షేర్ చేశారు? అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పడున్న మెటాడేటా పద్ధతి ప్రకారం ఇలాంటి వాటినిగుర్తించండం సాధ్యం కావడంలేదని ప్రభుత్వాల ఆరోపణ.
అయితే ఈ ఫీచర్ వల్ల ఇప్పటికే ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని, కేవలం ప్రభుత్వం అనుమతించిన శాంతి భద్రతల విభాగాలే కంటెంట్‌నుపరిశీలిస్తాయి తప్ప మరెవరికీ ఆక్సెస్ ఉండదని చెప్తున్నారు. దీనివల్ల పౌరుల హక్కులకు ఏమాత్రం భంగం కలగదని ప్రభుత్వ వర్గాలు హామీనిస్తున్నాయి.ఈ సౌలభ్యం ఉండాలని మన దేశమే కాకుండా ఇతర దేశాలు కూడా కోరుతున్నాయి. దీంతో సమాజంలో ఫేక్ న్యూస్‌లు రాకుండా నిరోధించవచ్చని వాటి అభిప్రాయం. ఆస్ట్రేలియా, సింగపూర్‌లలో అయితే ఇప్పటికే అనుమానం వచ్చిన తమ పౌరుల ప్రైవేట్ గ్రూప్ చాట్‌లను చెక్ చేసే విధంగా పోలీసులకు అధికారాలిచ్చే కొత్త చట్టాలను ఆయా ప్రభుత్వాలు తెచ్చాయి. కానీ, ప్రభుత్వం అడిగిన ఈ ఫీచర్ పెట్టాలంటే ఆ కంపెనీ యజమాని అయిన ఫేస్‌బుక్‌కు మెత్తం వాట్సాప్‌ను రీస్ట్రక్చర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.