కోణార్క్ సూర్య దేవాలయం
భువనేశ్వర్ : ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన కోణార్క్ సూర్య దేవాలయంలో పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రానికి లేఖ రాశారు.13వ శతాబ్దంలో నిర్మించిన అత్యంత పురాతన దేవాలయంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగా సందర్శకులు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎక్కడిక్కడ నీరు నిలిచి పోవడంతో ఆలయాన్ని సందర్శించకుండా చాలా మంది పర్యాటకులు వెనుదిరిగి వెళ్లిపోతున్నారని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
సమస్య తీవ్రతను అర్థం చేసుకుని శాశ్వత నివారణ చర్యలు చేపట్టి వారసత్వ కట్టడాన్ని రక్షించాల్సిందిగా నవీన్ పట్నాయక్ విఙ్ఞప్తి చేశారు. కేంద్రం, భారత పురావస్తు శాఖ నుంచి అనుమతి లభిస్తే ఆలయ పునరుద్ధరణ దిశగా చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment