జనావాసాలపై పాక్‌ దాడులు | Pak attacks on residents | Sakshi
Sakshi News home page

జనావాసాలపై పాక్‌ దాడులు

Published Fri, May 12 2017 2:05 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

Pak attacks on residents

జమ్ము: కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్లీ ఉల్లంఘించిన పాకిస్తాన్‌ సైన్యం... జనావాసాలే లక్ష్యంగా తెగబడింది. కశ్మీర్‌ రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో గురువారం జరిపిన మోర్టారు బాంబు దాడుల్లో ఓ మహిళ మరణించగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

భారత సైన్యం జరిపిన ప్రతీకార దాడుల్లో ఇద్దరు పాక్‌ సైనికులు గాయపడ్డారు. ‘బుధవారం రాత్రి నుంచి నౌషేరాలోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలపై మారణాయుధాలతో పాక్‌ ఆర్మీ  కాల్పులకు దిగింది. గురువారం ఉదయం మోర్టార్‌ షెల్‌ ఇంటిపై పడటంతో అక్తర్‌బీ(35) మరణించగా, ఆమె భర్త మొహ్మద్‌ హనీఫ్‌ గాయపడ్డారు’ అని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement