రైల్వే బడ్జెట్‌ను విలీనంనానికి సంబంధించి మార్చిన నిబంధనలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు
న్యూఢిల్లీ: కేంద్ర సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయడానికి సంబంధించి మార్చిన నిబంధనలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. రైల్వే శాఖకు కేటాయింపులు సహా, కేంద్ర బడ్జెట్ తయారీని ఆర్థిక వ్యవహారాల విభాగానికి అప్పగించినట్లు మంత్రివర్గ కార్యదర్శి తాజాగా ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొన్నారు.
భారత ప్రభుత్వ (వాణిజ్య కేటాయింపులు) నిబంధనలు–1961 చట్టంలో ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసేందుకు గతేడాది సెప్టెంబరులో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.