మహారాష్ట్ర సీఎం చవాన్ రాజీనామా | prithvi raj chavan resigns as maharashtra cm | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర సీఎం చవాన్ రాజీనామా

Published Fri, Sep 26 2014 6:43 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

మహారాష్ట్ర సీఎం చవాన్ రాజీనామా - Sakshi

మహారాష్ట్ర సీఎం చవాన్ రాజీనామా

మరాఠా రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మద్దతు ఉపసంహరించడంతో ముఖ్యమంత్రి పదవికి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలు కావడం, నామినేషన్ల దాఖలుకు కూడా సమయం మరొక్కరోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో సీఎం చవాన్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగించింది.

మహారాష్ట్రలో ఎన్నికలు కొద్ది రోజుల్లో ఉన్నాయనగా రెండు ప్రధాన కూటములలోను విభేదాలు వచ్చి రెండు కూటములు విడిపోయిన విషయం తెలిసిందే. అటు బీజేపీ - శివసేన, ఇటు కాంగ్రెస్ - ఎన్సీపీ రెండూ విడిపోయాయి. అదే తరుణంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్సీపీ తన మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో మైనారిటీలో పడిన ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం లేకపోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement